వజ్ర సింహాసన వైభవం

21 Sep, 2022 09:14 IST|Sakshi
ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలకు సిద్దమైన స్వర్ణ సింహాసనం

మైసూరు: స్వచ్ఛమైన బంగారం, అపురూపమైన వజ్రాలు, రత్నాలు పొదిగిన సింహాసనాన్ని చూడాలంటే మైసూరు ప్యాలెస్‌కు వెళ్లాల్సిందే. దసరా మహోత్సవాలకు నగరం హంగులు అద్దుకుంటుండగా, ప్యాలెస్‌లోనూ ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ప్యాలెస్‌లో ఉన్న దర్బార్‌ హాల్లో ఉన్న బంగారు సింహాసనాన్ని జోడించారు.  

వృశ్చిక లగ్నంలో పూజలు చేసి  
మంగళవారం ఉదయం 10.45 గంటల నుంచి 11.05 గంటల మధ్య శుభ వృశ్చిక లగ్నంలో పూజలు చేసి జోడింపు ప్రారంభించారు. మొదట వేద పండితుల సమక్షంలో గణపతి హోమం, చాముండి పూజ, శాంతి హోమం చేశారు. రాజవంశీకుడు యదువీర్‌ పాల్గొన్నారు. ప్యాలెస్‌లో కింది గదిలో ఉన్న స్ట్రాంగ్‌ రూంలో విడివిడిగా ఉన్న బంగారు, వజ్రఖచిత భాగాలను పోలీసు బందోబస్తు మధ్య దర్బార్‌ హాల్లోకి తీసుకొచ్చారు.

పురాతన కాలం నుంచి సింహా సనం ఉంచే స్థలంలో జోడించారు. ఈ కార్యక్రమంలో గెజ్జగెహళ్లి గ్రామస్తులు, రాజమాత ప్రమోదాదేవి పాల్గొన్నారు. జోడింపు పూర్తయ్యాక మళ్లీ పూజలు చేసి తెల్లని వస్త్రంతో కప్పిఉంచారు. సెప్టంబర్‌ 26వ తేదీన దసరా నవరాత్రి ఉత్సవాల రోజున యదువీర్‌ ఈ సింహాసనాన్ని అధిష్టిస్తారు.  

(చదవండి: వధువు స్పెషల్‌ ఫోటో షూట్‌... ప్రశంసలతో ముంచెత్తిన నెటిజన్లు)

మరిన్ని వార్తలు