సరికొత్త బిహార్‌లో నితీశ్‌ కీలకం

14 Sep, 2020 05:52 IST|Sakshi

నితీశ్‌ పాలనపై మోదీ ప్రశంసల వర్షం

బిహార్‌లో మూడు పెట్రో ప్రాజెక్టుల్ని ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువెళ్లడంలో బిహార్‌ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సుపరిపాలనపై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. సరికొత్త భారత్, సరికొత్త బిహార్‌ లక్ష్యంలో నితీశ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సుపరిపాలన మరో అయిదేళ్ల పాటు కొనసాగాలన్నారు. సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రజలకి ప్రభుత్వ పథకాలతో ఎంత లబ్ధి చేకూరుతుందో గత 15 ఏళ్లుగా బిహార్‌వాసులకి తెలుస్తోందన్నారు.

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో రూ.900 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన మూడు పెట్రోలియం ప్రాజ్టెల్ని మోదీ ఆదివారం జాతికి అంకితం చేశారు. పారాదీప్‌–హల్దియా–దుర్గాపూర్‌ పైప్‌లైన్‌ ఆగ్మెంటేషన్‌ ప్రాజెక్టు, బంకా, చంపరాన్‌లో లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) బాటిలింగ్‌ ప్లాంట్స్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన ప్రధాని ఆ రాష్ట్ర ఎన్డీయే కూటమిలో చీలికలు వస్తున్నాయన్న ఊహాగా నాలకు తన ప్రసంగం ద్వారా చెక్‌ పెట్టారు.

మరిన్ని వార్తలు