వైరల్‌: చిన్నారిని హెచ్చరిస్తున్న పిల్లి

23 Jan, 2021 18:53 IST|Sakshi

సాధారణంగా పిల్లల ప్రతి అడుగును గమనిస్తూ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటారు. చిన్నారులు చేసే అల్లరిని హెచ్చరిస్తుంటారు. అయితే పిల్లలకు ఎదురుగా గొడ కనిపిస్తే చాలు అది ఎక్కాలనో లేక దాని నుంచి కిందకు చూడటానికి ఆసక్తి చూపుతారు. అలాంటి సమయంలో పెద్దలు వారిని గట్టిగా వారిస్తుంటారు. అయితే ఇక్కడ ఓ పెంపుడు పిల్లి ఆ బాధ్యతను తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ చిన్నారినే గమనిస్తూ అతడు వేసే తప్పటడుగులను వారిస్తూ కాపాలాగా ఉన్న ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ది ఫీల్‌ గుడ్‌ అనే ట్విటర్‌ పేజీలో ‘అతని రక్షణ దేవత’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో లైక్స్‌.. వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. ఇప్పటికీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘ఆ చిన్నారి భయంకరమైన ప్రమాదం బారిన పడకుండా హెచ్చరించడంలో తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత ఈ పిల్లి తీసుకుంటోంది’ (చదవండి: యజమాని కోసం 6 రోజులు ఆసుపత్రి బయటే..)

‘ఈ వీడియో చూడటానికి ఎంత అందంగా ఉంది’, మనుషుల కంటే జంతువులే మేలు’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా 50 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఓ చిన్నారి ఇంటి‌ బాల్కానీ వద్ద నిలుచుని ఉన్నాడు. అతడి పక్కనే ఆ ఇంటి పెంపుడు పిల్లి బాలుడిని గమనిస్తూ ఉంది. అతడు బాల్కానీ గోడ పట్టుకుని పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం అతడు గోడ అంచును పట్టుకోవడానికి చేతులు పైకి చాస్తుండగా ఆ పిల్లి వద్దన్నంటు వారిస్తోంది. అయినప్పటికి అతడు దానికి దూరంగా జరుగుతూ గోడ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లి అతడికి దగ్గరగా వెళుతూ చిన్నారిని వారిస్తూనే ఉంది. చివరకు ఆ బాలుడు గోడ పట్టుకొకుండా అడ్డుగా వచ్చి నిలుచుంది. (చదవండి: 'పొట్ట పెంచుదాం'.. వైరల్‌గా మారిన రెస్టారెంట్‌)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు