Nicholas Pooran: వెస్టిండీస్‌ కెప్టెన్‌ అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన

14 Jun, 2022 13:34 IST|Sakshi

వెస్టిండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ వన్డేల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్‌ ప్రధానంగా ఉండే కెప్టెన్‌.. ఒక వన్డేల్లో బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం చాలా తక్కువగా చూస్తుంటాం. ఒక కెప్టెన్‌ బౌలింగ్‌లో ఐదు వికెట్ల ఫీట్‌ నమోదు చేయడం కూడా అరుదుగానే కనిపిస్తోంది. రెగ్యులర్‌ బౌలర్‌ కెప్టెన్‌గా ఐదు వికెట్లు తీయడం కొత్త కాకపోవచ్చు.. కానీ ఒక బ్యాటర్‌ తొలిసారి బౌలింగ్‌లో మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం అరుదు. 

తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో నికోలస్‌ పూరన్‌ అదే ఫీట్‌ నమోదు చేశాడు. బౌలింగ్‌లో సూపర్‌ ప్రదర్శన చేసి దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. ఇంతకముందు వన్డే కెప్టెన్‌గా ఉంటూ బౌలింగ్‌లో మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్లు నలుగురు మాత్రమే. వారిలో సౌరవ్‌ గంగూలీ, మైక్‌ గాటింగ్‌, గ్రహం గూచ్‌, నవ్‌రోజ్‌ మంగల్‌లు మాత్రమే ఉన్నారు. పూరన్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్‌ చేసి 48 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అయితే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో పాకిస్తాన్‌ 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయడం విశేషం. ఇ​క పూరన్‌ పాక్‌తో మ్యాచ్‌కు ముందు వన్డేల్లో కేవలం మూడు బంతులు మాత్రమే వేశాడు. తాజాగా మాత్రం 10 ఓవర్ల కోటా బౌలింగ్‌ పూర్తి చేసి రెగ్యులర్‌ బౌలర్‌ తరహాలో నాలుగు వికెట్లు తీసి అందరిని ఆకట్టుకున్నాడు.

ఇక పూరన్‌ ప్రదర్శనను మెచ్చుకున్న ఐసీసీ.. గతంలో బ్యాటింగ్‌ కెప్టెన్‌ బౌలింగ్‌లో అద్బుత ప్రదర్శన చేసిన సందర్భాలను మరోసారి గుర్తుచేసుకొంది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.  

సౌరవ్‌ గంగూలీ:
టీమిండియా తరపున విజయవంతమైన కెప్టెన్లలో సౌరవ్‌ గంగూలీ ఒకడు. తన కెరీర్‌లో 311 వన్డేలు ఆడిన గంగూలీ సరిగ్గా వంద వికెట్లు తీయడం విశేషం. ఎక్కువగా పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా బౌలింగ్‌ చేసిన గంగూలీ.. ఒక కెప్టెన్‌గా 25 వన్డేల్లో 10 ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. ఇక 2000లో కాన జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గంగూలీ 10 ఓవర్లు వేసి 34 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ 68 బంతుల్లో 78 పరుగులు నాటౌట్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

గ్రహం గూచ్‌:
ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ గ్రహం గూచ్‌ 1989లో ఎంఆర్‌ఎఫ్‌ వరల్డ్‌ సిరీస్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి బౌలింగ్‌లో చెలరేగాడు. 10 ఓవర్ల కోటా బౌలింగ్‌ పూర్తి చేసిన గ్రహం గూచ్‌ 19 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. జావెంద్‌ మియాందాద్‌, సలీమ్‌ యూసఫ్‌, వసీం అక్రమ్‌ల రూపంలో తన ఖాతాలో వేసుకున్నాడు. గ్రహం గూచ్‌ దెబ్బకు పాకిసత​ఆన్‌ 148 పరుగులు చేసింది. ఆ తర్వాత 44 ఓవర్లలో ఆసీస్‌ విజయం అందుకుంది.

మైక్‌ గాటింగ్‌:
మైక్‌ గాటింగ్‌ తన కెరరీలో 10 వికెట్లు తీయగా.. అందులో మూడు వికెట్లు 1987లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తీశాడు. 9 ఓవర్లు వేసిన గాటింగ్‌ 59 పరుగులిచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది.

నౌరోజ్‌ మంగల్‌:
అఫ్గన్‌కు కెప్టెన్‌గా పనిచేసిన నౌరోజ్‌ మంగల్‌ 2009లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ బౌలింగ్‌తో మెరిశాడు. 6 ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసిన మంగల్‌ 35 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ​కాగా నెదర్లాండ్స్‌ ఓపెనర్లు టెన్‌ డెస్కటే,ఎరిక్‌ క్రిన్‌స్కిల 113 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసిన మంగల్‌ ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీశాడు. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం.

మరిన్ని వార్తలు