PAK vs AUS: పాకిస్తాన్‌ ముందు భారీ టార్గెట్‌.. ఓటమి తప్పదా!

25 Mar, 2022 08:11 IST|Sakshi

లాహోర్‌: ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ టెస్టు సిరీస్‌ ఉత్కంఠభరిత ముగింపునకు చేరింది. మూడో టెస్టులో 351 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన పాక్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (42 బ్యాటింగ్‌), అబ్దుల్లా షఫీఖ్‌ (27 బ్యాటింగ్‌) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.

నేడు చివరి రోజు ఆ జట్టు చేతిలో 10 వికెట్లతో మరో 278 పరుగులు చేయాల్సి ఉంది. అంతకు ముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను 3 వికెట్లకు 227 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఉస్మాన్‌ ఖాజా (178 బంతుల్లో 104 నాటౌట్‌; 8 ఫోర్లు) సిరీస్‌లో రెండో సెంచరీ సాధించగా, డేవిడ్‌ వార్నర్‌ (51) అర్ధ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న స్టీవ్‌ స్మిత్‌ అందరికంటే వేగంగా (151 ఇన్నింగ్స్‌లు) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌ 2022కు ఉగ్రదాడి ముప్పు..?!

  
 

మరిన్ని వార్తలు