'రషీద్‌ బాగున్నావు.. నీ ప్యాలెస్‌ సూపర్‌గా ఉంది'

9 May, 2021 18:35 IST|Sakshi

కాబుల్‌: అప్ఘనిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ రంజాన్‌ మాసం సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫోటో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. నీలం రంగు కుర్తా, ప్యాంట్‌ వేసుకొని రాజసం ఉట్టిపడేలా రషీద్‌ ఇచ్చిన ఫోజు.. దానికి తోడూ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్యాలెస్‌లో రెండు వైపులా మెట్లు కనిపించడం.. నేల మీద పరిచి ఉన్న తివాచీ ఆ ఫోటోకు మరింత అందాన్నిచ్చింది. కాగా రషీద్‌ షేర్‌ చేసిన ఫోటోపై ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియల్‌ వ్యాట్‌ స్పందించింది. ''వారెవ్వా వాటే ప్యాలెస్‌.. రషీద్‌ నీ డ్రెస్సింగ్‌ సూపర్‌..'' అంటూ కామెంట్‌ చేసింది. టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా రషీద్‌ ఫోటోపై కామెంట్‌ చేశాడు.''క్యా బాత్‌ హై.. రషీద్‌.. ఇలాంటి ఫోటోలు మరిన్ని ఉంటే నాకు పంపించు.. ఎదురుచూస్తున్నా'' అంటూ పేర్కొన్నాడు. 


ఇక ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్‌ ఖాన్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 7 మ్యాచ్‌లాడిన రషీద్‌ 10 వికెట్లు మాత్రమే తీశాడు.. ఎకానమీ రేటు మాత్రం ఎక్కువ లేకుండా చూసుకున్నాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ సీజన్‌లో దారుణ ప్రదర్శన నమోదు చేసింది. ఏడు మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే గెలిచి.. మిగతా ఆరు ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇక బయోబబూల్‌కు కరోనా సెగ తగలడంతో ఐపీఎల్‌ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కాగా లీగ్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
చదవండి: పాకిస్తాన్‌కు ఆడాల్సింది కాదు.. తప్పు చేశా

A post shared by Rashid Khan (@rashid.khan19)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు