నీరజ్‌, భజరంగ్‌లను అభినందించిన సీఎం జగన్‌

7 Aug, 2021 18:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో ఘనమైన ముగింపు ఇచ్చిన భారత అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందించారు.జావెలిన్‌ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన జావెలిన్‌ త్రో తుది పోరులో నీరజ్‌ చోప్రా 87. 58 మీటర్ల దూరం విసిరి చరిత్ర సృష్టించాడు.

అదే సమయంలో టోక్యో ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ విభాగంలోకాంస్యం సాధించి కొత్త అధ్యాయం లిఖించిన భజరంగ్‌ పూనియాను సీఎం వైఎస్‌ జగన్‌ కొనియాడారు. అత్తుత్తమ ప్రదర్శన, అంతర్గత బలం కనబరచి.. దేశానికి పతకం సాధించావని భజరంగ్‌ పూనియాను సీఎం జగన్‌ అభినందించారు. రెజ్లింగ్‌ 65 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్‌ దౌల‌త్ నియాజ్‌బెకోవ్‌కు కనీస అవకాశం ఇవ్వకుండా 8-0 తేడాతో చిత్తుగా ఓడించి.. భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ భజరంగ్‌ పూనియాకు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు