-

గాంధీ వైద్యుల మరో ముందడుగు 

21 Aug, 2023 01:50 IST|Sakshi

బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తినుంచి లివర్‌ సేకరించిన వైద్యులు 

ఉస్మానియాలో మరో వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంట్‌ 

అభినందించిన మంత్రి హరీష్‌ రావు 

గాందీఆస్పత్రి : బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తికి చెందిన  కాలేయాన్ని సికింద్రాబాద్‌ గాం«దీఆస్పత్రి వైద్యులు  సేకరించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి అమర్చారు. గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపిన వివరాల ప్రకారం... గాం«దీఆస్పతితో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి బ్రెయిన్‌డెడ్‌అయ్యాడు. అతని కుటుంబసభ్యుల అంగీకరించడంతో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి శరీరం నుంచి పలు అవయవాలు సేకరించాలని వైద్యులు నిర్ణయించారు\

లివర్‌ ఒక్కటే పూర్తిస్థాయిలో పనిచేస్తుందని, మిగతా అవయవాల పనితీరు బాగోలేదని వైద్యపరీక్షల్లో తేలింది. జీవన్‌దాన్‌లో నమోదు చేసుకున్న జాబితా ప్రకారం ఏబీ బ్లడ్‌ గ్రూపుకు చెంది లివర్‌ సమస్యతో బాధపడేవ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. గాంధీ వైద్యులు బ్రెయిడ్‌ డెడ్‌ అయిన వ్యక్తి శరీరం నుంచి లివర్‌ను సేకరించి (రిట్రీవల్‌) ప్రత్యేక వాహనంలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, అక్కడ చికిత్స పొందుతున్న మరోవ్యక్తికి (ట్రాన్స్‌ప్లాంట్‌) అమర్చారు.

లివర్‌ను సేకరించడం ఇదే గాందీఆస్పత్రిలో మొదటిసారని వివరించారు. గాంధీ ఆస్పత్రిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో  లివర్‌ను విజయవంతంగా సేకరించి మరో వ్యక్తికి అమర్చి పునర్జన్మ ప్రసాదించిన గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు, గాంధీ, ఉస్మానియా వైద్యులు, సిబ్బందిని వైద్యమంత్రి హరీష్‌ రావు  అభినందించారు.  

మరిన్ని వార్తలు