Sakshi News home page

ప్రజల కష్టాలు తీరుస్తాం: యోగి

Published Mon, Nov 27 2023 3:54 AM

UP Chief Minister Yogi Adityanath Roadshow in Telangana - Sakshi

ఆమనగల్లు, సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, ఎల్‌బీనగర్‌/లింగోజిగూడ, కుత్బుల్లాపూర్‌: బీజేపీకి అధికారం ఇస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హామీనిచ్చారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తేనే ప్రజల కష్టాలు తీరి తెలంగాణ సమగ్రాభివృద్ధి సా ధ్యమన్నారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో జరిగిన ప్రజాదీవెన సభ లో, మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విజయసంకల్ప సభలో, కర్మన్‌ఘాట్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో, షాపూర్‌నగర్‌లో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఎందరో త్యా గాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను కేసీఆర్‌ కు టుంబం దోచుకుంటోందని ధ్వజమెత్తారు.

ఇక్కడ కూడా గో మాఫియా, పశు మాఫియా ఉన్నాయనీ, ఆ మాఫియాలను హెచ్చరించేందుకు ఇక్కడికి వ చ్చానని వ్యాఖ్యానించారు. 2017 కంటే ముందు ఉత్తరప్రదేశ్‌లో మాఫియాలు ఉండేవనీ, ఇప్పుడు మోదీ నేతృత్వంలోని మార్గదర్శకంలో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉండడంతో అక్కడ ప్రశాంతంగా ఉందన్నారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు కామన్‌ ఫ్రెండ్‌ ఎంఐఎం. ఫెవికాల్‌ వలే ఎంఐఎం పనిచేస్తుంది. ఈ మూడు పార్టీలు ఒక్కటే. తెలంగాణ ప్రజల మనోభావాలు, జీవితాలతో ఇవి ఆటలాడుకుంటున్నాయి’’అని విమర్శించారు. 

హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మారుస్తాం 
బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే హైదరా బాద్‌ పేరును భాగ్యనగరంగా మారుస్తామని యూపీ సీఎం యోగి ప్రకటించారు. అమరుల త్యా గాలతో వచ్చిన తెలంగాణను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పుల తెలంగాణగా మార్చిందని, నిరుద్యోగులను రోడ్డుపాలు చేసిందని ఆరోపించారు. 

బీజేపీ అభ్యర్ధిని గెలిపిస్తే రామ మందిరం దర్శనం ఉచితం 
అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తవుతోంది.. బీజేపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించి వారితో పాటు మీరంతా 2024, జనవరి 26న జరిగే అయోధ్యలో రామ మందిరం ప్రారం¿ోత్సవానికి రండి.. ఉచిత దర్శనం వాళ్లే కల్పిస్తారు’’అంటూ యోగి ఆదిత్యనా«థ్‌ చెప్పుకొచ్చారు. 

Advertisement

What’s your opinion

Advertisement