Sudden Cardiac Arrest: హైదరాబాద్‌లో ఆకస్మిక గుండెపోటుతో ఇద్దరు మృతి.. డాక్టర్లు ఏమంటున్నారంటే!

24 Feb, 2023 12:01 IST|Sakshi

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో హఠాత్తుగా అడ్డంకులు ఏర్పడటాన్ని గుండెపోటు అంటారు. మరి గుండెకు రక్తం, ఆక్సిజన్‌ సరిగా అందకపోతే అది పంపింగ్‌ చేయలేదు. ఎంత ఎక్కువసేపు అడ్డంకి ఏర్పడితే గుండెకు అంత నష్టం ఏర్పడుతుంది. పురుషుల్లో ఇలాంటి గుండెపోటు 65 ఏళ్లకు.. మహిళల్లో 70 ఏళ్లకు వస్తాయనేది పాత లెక్క. కానీ ఇటీవల ఆ వయసు క్రమంగా తగ్గిపోతుంది.

వయసుతో సంబంధం లేకుండా.. గుండెపోటు ముప్పు అందరిని చుట్టుముడుతోంది. ముఖ్యంగా యువత, చిన్నారుల్లో సడెన్‌ హార్ఠ్‌ ఎటాక్‌ కేసులు ఎక్కువగా అవుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో రబ్బాని అనే వ్యక్తి పెళ్లి వేడుకలో సంతోషంగా పాల్గొని.. వరుడి పాదాలకు పసుపు రాస్తుండగా గుండెపోటుతో క్షణాల వ్యవధిలో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే.

తాజాగా బోయినపల్లిలో జిమ్‌లో కసరత్తులు చేస్తూ 24 ఏళ్ల యువ కానిస్టేబుల్‌ విశాల్‌ ఉన్నట్టుండి కుప్పకూలాడు.. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించడగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే యువకుల్లో గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు కనిపించకపోవడం అతిపెద్ద సమస్య. చాలాసార్లు నిశబ్ధంగా విరుచుకుపడి.. ప్రాణాల మీదకు తెస్తుంది. ఇలా వరుసగా జరుగుతున్నసైలెంట్‌ గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సడెన్‌ హార్ట్‌ ఎటాక్‌పై ప్రముఖ కార్డియాలజిస్ట్‌ చాణక్య కిషోర్‌ సాక్షితో మాట్లాడారు.  యువతలో ఆకస్మిక గుండెపోటుకు కారణాలు ఏంటి.. దీన్ని ముందుగా గుర్తించగలమా?. ఎలాంటి జాగ్రత్తలతో గుండెపోటును నివారించవచ్చు.. అనే అంశాలపై ఆయన చెప్పిన వివరాలు డాక్టర్‌ మాటల్లోనే...

మరిన్ని వార్తలు