మార్పు మన నుంచే ప్రారంభం కావాలి

27 Jul, 2023 01:11 IST|Sakshi
కార్గిల్‌ యుద్ధంలో మరణించిన జవాన్ల కుటుంబసభ్యులను ఓదార్చుతున్న గవర్నర్‌ తమిళిసై

24వ కార్గిల్‌ దివస్‌లో గవర్నర్‌ తమిళిసై

హిమాయత్‌నగర్‌: మార్పు మనఇంట్లో నుంచి..అంటే వ్యక్తి నుంచే ప్రారంభమైతే దేశం ప్రగతిపథంలో ముందుకెళుతుందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. నేటితరం పిల్లలు ఏసీ లేకపోయినా, చెమట పట్టినా భరించలేని పరిస్థితుల్లో పెరుగుతున్నారన్నారు. దేశ రక్షణ, భావితరాల భవిష్యత్‌కు సరిహద్దుల్లో మన సైనికులు రక్తం కారుస్తూ, చెమటో­డుస్తూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ప్రాణాలను అడ్డేస్తున్నారని చెప్పా­రు. 24వ కార్గిల్‌ దివస్‌ కార్యక్రమం బుధవారం హైదరాబా­ద్‌లోని కేఎంఐటీలో నిర్వహించారు.

ముఖ్య­అతిథిగా హాజరైన గవర్నర్‌ మాట్లాడుతూ దేశంకోసం త్యాగం చేస్తున్న సైనికులను ప్రతిరోజూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటితరం వారు సినిమా హీరోలు, క్రీడాకారులను మాత్రమే గుర్తించగలుగుతున్నారని, కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న సైనికులు,  వారిత్యాగాల గురించి ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందినవారి కుటుంబీకులకు  గవర్నర్‌ ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు. రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్రప్రసాద్, మేజర్‌ జనరల్‌ వీకే పురోహిత్, జమ్మూకశ్మీర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సందీప్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు