జేఈఈ మెయిన్స్‌కు ‘సర్వర్‌’ షాక్‌

25 Jun, 2022 10:16 IST|Sakshi

గంటల తరబడి పరీక్ష ఆలస్యం.. పూర్తి ప్రశ్నలు కన్పించని వైనం

సాంకేతిక కారణాలతో ఓ కేంద్రంలో మధ్యాహ్నం సెషన్‌ పరీక్ష వాయిదా

సాక్షి, హైదరాబాద్‌/సుల్తాన్‌బజార్‌: జేఈఈ మెయిన్స్‌ పరీక్ష శుక్రవారం విద్యార్థులకు చుక్కలు చూపింది. ప్రధానంగా హైదరాబాద్‌లోని అబిడ్స్, మూసారాంబాగ్‌లలో ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన రెండు కేంద్రాల్లో సాంకేతిక సమస్యలతో పరీక్ష గంటల తరబడి ఆలస్యమైంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ పరీక్ష కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. పరీక్ష నిర్వహణలో జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విఫలమైందని మండిపడ్డారు. కొందరు విద్యార్థులు కాలేజీ అద్దాలు పగలగొట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని శాంతింపజేశారు.

సర్వర్‌ మొరాయించడంతో...
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌ తొలిదశ పరీక్షను ఈ నెల 23 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని మూసా రాంబాగ్‌ పరీక్ష కేంద్రంలో శుక్రవారం ఉద యం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా విద్యార్థులు 8 గంటలకే కేంద్రానికి చేరుకున్నారు. అయితే ఆడ్మిట్‌ కార్డుపై బార్‌ కోడ్‌ను స్కాన్‌ చేసే సమయంలో ఎన్‌టీఏతో అను సంధానమైన సర్వర్‌ మొరాయించింది. చాలా సేపటి వరకూ అది పనిచేయలేదు. చివరకు కనెక్ట్‌ అవ్వడంతో విద్యార్థులను పరీక్ష హాలు లోకి పంపారు. అప్పటికే మానసిక ఆందోళనకు గురైన విద్యా ర్థులు పూర్తిస్థాయి లో పరీక్ష రాయలేకపోయి నట్లు తెలిపారు.

కంప్యూ టర్‌ స్క్రీన్‌పై కొన్ని ప్రశ్నలు సైతం సరిగ్గా కని పించలేదని.. ఫలితంగా పదుల సంఖ్యలో మార్కులు కోల్పో యామని పేర్కొ న్నారు. మధ్యాహ్నం 3 గంట ల సెషన్‌లోనూ ఇదే సమస్య తలెత్తింది. కొంద రు విద్యార్థులు మొత్తం ప్రశ్నలు కన్పించలేదని తెలిపారు.  అబిడ్స్‌లోని పరీక్ష కేంద్రంలోనూ ఇదే రకమైన సమస్య ఎదురైంది. ఉదయం 9 గంటలకు జర గాల్సిన పరీక్ష 10:30 గంటలకు మొదలైంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన పరీక్ష సాంకేతిక కారణాలతో సాయంత్రం 5 గంటల వరకు మొదలుకాక పోవడంతో ఆ కేంద్రంలో పరీక్షను ఎన్‌టీఏ వాయిదా వేసినట్లు కాలేజీ నిర్వాహకులు ఓ నోట్‌ విడుదల చేశారు. పరీక్ష తేదీని ఎన్‌టీఏ త్వరలో ప్రకటిస్తుందన్నారు.

గణితం తికమక... ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజీ
రెండేళ్ల జేఈఈ మెయిన్స్‌ పేపర్‌తో పోలిస్తే ఈసారి తేలికగానే ఉంది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా ఆన్‌లైన్‌ బోధన జరగడం వల్ల కొంత ఇబ్బంది పడే వీలుంది. గణితం 5 నుంచి 10 న్యూమరికల్‌ ప్రశ్నలు మినహా సమాధానాలు గుర్తించడానికి ఎక్కువ సమయం తీసుకుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రశ్నలు గతంలో వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఎన్‌సీఈ ఆర్‌టీ సిలబస్‌ నుంచే ప్రశ్నలు వచ్చాయి. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 300 మార్కులకు 78 నుంచి 87 మార్కులు తెచ్చుకుంటే అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటా అభ్యర్థులు 60 నుంచి 65 మార్కులతో క్వాలిఫై అవుతారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40–50 మార్కులతో క్వాలిఫై అయ్యే అవకాశం కనిపిస్తోంది.    
–  ఎంఎన్‌రావు, గణిత శాస్త్ర నిపుణుడు

తీవ్ర ఆందోళనకు గురయ్యాం
దాదాపు 4 గంటలు ఎండలో ఉండాల్సి వచ్చింది. సర్వర్‌ పనిచేయడం లేదని చెప్పారు. ఆ తర్వాత తర్వాత పరీక్ష రాసినా తీవ్ర ఆందోళన మధ్య సరిగా సమాధానాలు ఇవ్వలేకపోయాం. ఈ పరీక్షను తిరిగి నిర్వహిస్తే బాగుంటుంది.
  –  అతావుల్లా, జేఈఈ పరీక్ష రాసిన     విద్యార్థి, టౌలిచౌకి 

అరోరా కాలేజీ వద్ద ఉద్రిక్తత
అబిడ్స్‌ అరోరా కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ఇంకా జరగలేదు. ఇదే విషయంపై సిబ్బందిని ప్రశ్నిస్తే సర్వర్‌డౌన్‌, టెక్నికల్‌ ప్రాబ్లమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కాలేజీ కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దీంతో అబిడ్స్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. 

చదవండి: (అర్ధరాత్రి ఫోన్‌.. భర్త వార్నింగ్‌.. గంట తర్వాత చూస్తే..)

మరిన్ని వార్తలు