టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌ శ్రీజకు కేటీఆర్‌ అభినందన

17 May, 2022 04:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ మహిళా చాంపియన్‌షిప్‌ సాధించిన టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, కోచ్‌ సోమ్‌నాథ్‌ ఘోష్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. రాష్ట్రం నుంచి తొలిసారిగా ఈ ఘనత సాధించిన శ్రీజ, బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంగా క్రీడాకారిణి శ్రీజ, కోచ్‌లు మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో సోమవారం కలిశారు.

ప్రయాణం, క్రీడా సామ గ్రికి ఆర్థిక సాయంతో పాటు ఇతర సహ కారం కూడా అందిస్తామని వారికి భరోసా ఇచ్చా రు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, ప్రభుత్వ చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ ఆత్మకూరి అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ప్రకాశ్‌రాజు ఉన్నారు. 

మరిన్ని వార్తలు