లాక్‌డౌనా.. కర్ఫ్యూనా.. 48 గంటల్లోగా తేల్చండి: హైకోర్టు

19 Apr, 2021 17:30 IST|Sakshi

తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. 48 గంటల్లోగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ విధింపుపై నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కోవిడ్‌ వ్యాప్తిపై ప్రభుత్వం సమీక్షలు నిర్వహించడం తప్ప చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

ఈ మేరకు అధికారులు సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. వెబ్‌సైట్‌లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలన్న హైకోర్టు.. జీహెచ్‌ఎంసీలో నమోదైన కరోనా కేసుల వివరాలు వార్డుల వారీగా సమర్పించాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్‌ 24 గంటల్లోగా వచ్చేలా చూడాలని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 23కి వేసింది. 

చదవండి: ‘కరోనా పురుగు దొరికితే మాజీ సీఎం నోట్లో వేస్తాను’

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు