హనుమంతుడిపై కోదండరాముడి తేజసం

3 Apr, 2014 03:27 IST|Sakshi

తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్ :  తిరుపతిలోని కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వా మి వరదహస్తం దాల్చి హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయ మిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాల కోలాటాల నడుమ రఘురాముడు హనుమంతుని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు.

అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. వాహన సేవ అనంతరం స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు వసంతోత్సవం, తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది. 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్ సేవ వేడుకగా నిర్వహించారు. రాత్రి 8 గంటలకు గజ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.

టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, స్థాని క ఆలయాల డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో ప్రసాదమూర్తిరాజు,  ఇతర అధికారులు, విశేష సంసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో  మహతి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
 
కోదండరామునికి వైభవంగా వస్త్ర సమర్పణ
 
కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలోని 50 శ్రీరామ ఆలయాల నిర్వాహకులు బుధవారం రాములవారికి వస్త్ర సమర్పణ చేశారు. ఆలయాల నిర్వాహకులు సాయంత్రం తిరుపతిలోని శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి రఘునాథ్, డెప్యూటీ ఈవో ఉమాపతిరెడ్డి వస్త్రాల ఊరేగింపు ను ప్రారంభించారు. వస్త్రాలను ఊరేగింపుగా కోదండరామాలయానికి తీసుకొచ్చారు.

టీటీడీ స్థానిక ఆల యాల డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఇతర అధికారు లు ఆలయ మర్యాదలతో వస్త్ర సమర్పణ ఊరేగింపున కు స్వాగతం పలికారు. వస్త్ర సమర్పణ చేసిన  ఆలయా ల నిర్వాహకులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, టీటీడీ హిందూ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరామ కంకణాలు, పుస్తక ప్రసాదాలను పంపిణీ చేశా రు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ కంకణాలను, పుస్తక ప్రసాదాన్ని ఆయా గ్రామాల్లోని భక్తులకు ఆలయ నిర్వాహకులు అందజేయనున్నారు.
 

మరిన్ని వార్తలు