తగ్గిన ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ నష్టాలు

24 Jul, 2019 10:21 IST|Sakshi

మొండి బకాయిలు తగ్గాయ్‌  

అయినా అధిక స్థాయిల్లోనే కేటాయింపులూ తగ్గాయ్‌  

రూ.5,006 కోట్లకు మొత్తం ఆదాయం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా తగ్గాయి. గత క్యూ1లో రూ.919 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.342 కోట్లకు తగ్గాయని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) తెలిపింది. రుణాల రికవరీ బావుండటం, కేటాయింపులు తగ్గడంతో నష్టాలు కూడా తగ్గాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.5,327 కోట్ల నుంచి 6 శాతం తగ్గి రూ.5,006 కోట్లకు చేరిందని తెలిపింది. వడ్డీ ఆదాయం 2 శాతం వృద్ధితో రూ.4,336 కోట్లకు పెరగ్గా, ఇతర ఆదాయం మాత్రం 38 శాతం తగ్గి రూ.670 కోట్లకు పరిమితమైందని పేర్కొంది.

తగ్గినా, అధికంగానే మొండి బకాయిలు....
మొండి బకాయిలు గణనీయంగానే తగ్గినా, అధిక స్థాయిల్లోనే ఉన్నాయి. గత క్యూ1లో 25.64 శాతం(రూ.38,146 కోట్లు)గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 22.53 శాతాని(రూ.33,262 కోట్ల)కి తగ్గాయని ఐఓబీ తెలిపింది. నికర మొండి బకాయిలు 15.10 శాతం(రూ.19,642 కోట్లు)నుంచి 11.04 శాతాని(రూ.14,174 కోట్లు)కి తగ్గాయని పేర్కొంది. మొండి బకాయిలు తగ్గడంతో మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,051 కోట్ల నుంచి రూ.1,170 కోట్లకు తగ్గాయని వివరించింది. రుణ రికవరీలు రూ.3,389 కోట్ల నుంచి రూ.2,238 కోట్లకు తగ్గాయని తెలిపింది. ఇక తాజా మొండి బకాయిలు రూ.2,050 కోట్లకు పరిమితమయ్యాయని వివరించింది. తాజా మొండి బకాయిలు కన్నా రికవరీలు అధికంగా ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి మొత్తం డిపాజిట్లు రూ.2.21 లక్షల కోట్లకు, రుణాలు రూ.1.47 లక్షల కోట్లకు, మొత్తం వ్యాపారం రూ.3.69 లక్షల కోట్లకు చేరాయని ఐఓబీ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ 0.7 శాతం లాభంతో రూ.11.80 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాట్‌ ప్రారంభం : 38 వేల ఎగువకు సెన్సెక్స్‌

38వేల దిగువకు సెన్సెక్స్‌

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,795 కోట్లు

హైదరాబాద్‌లో పేపాల్‌ టెక్‌ సెంటర్‌

జగన్‌! మీరు యువతకు స్ఫూర్తి

బీఎస్ఎన్‌ఎల్‌ స్టార్‌ మెంబర్‌షిప్‌ @498

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.1,473 కోట్లు

2018–2019కు ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగింపు

హ్యుందాయ్‌ కార్ల ధరలు మరింత ప్రియం

జీడీపీ వృద్ధి రేటు ‘కట్‌’కట!

ఫార్చూన్‌ ఇండియా 500లో ఆర్‌ఐఎల్‌ టాప్‌

‘ఇల్లు’ గెలిచింది..!

మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

రూ 1999కే ఆ నగరాలకు విమాన యానం

అనిల్‌ అంబానీ కంపెనీల పతనం

మార్కెట్ల రీబౌండ్‌

మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో

క్రిప్టోకరెన్సీ అంటే కఠిన చర్యలు

టీఎస్‌ఎస్‌ గ్రూప్‌లో ఆర్‌వోసీ సోదాలు!

ప్రింట్‌ను దాటనున్న ‘డిజిటల్‌’

లాభాల బాటలోనే ఓబీసీ..

ఆమ్రపాలి గ్రూపునకు సుప్రీం షాక్‌

బజాజ్‌ సీటీ 110 @: రూ.37,997

టీవీఎస్‌ మోటార్‌ లాభం 6 శాతం డౌన్‌

హైదరాబాద్‌లో వన్‌ప్లస్‌ అతిపెద్ద స్టోర్‌

కోటక్‌ బ్యాంక్‌ లాభం 1, 932 కోట్లు

బజాజ్‌తో వన్‌ ప్లస్‌ ఇండియా ఒప్పందం

నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌మార్కెట్లు

ఫార్చూన్‌ 500లో షావోమి

జీవితకాల గరిష్టస్థాయికి పసిడి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌