స్వల్పంగా పెరిగిన పెట్రోల్‌,డీజిల్‌ ధరలు

20 Mar, 2018 11:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూడిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌   జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా  పెరిగాయనీ, పెరిగిన ధరలు మంగళవారం ఉదయం 6గంటలనుంచి అమల్లో ఉంటుందని ప్రకటించింది. డీజిల్‌పై 7పైసలు, పెట్రోల్‌పై ఒక పైస పెరిగిందని చెప్పింది.

పెరిగిన ధరల ప్రకారం మెట్రో నగరాల్లో లీటరు పెట్రోల్‌ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ( రూ. 72.94), కోల్‌కతా( రూ. 74.94), ముంబై( 80.07), చెన్నై( రూ.74.87). మొత్తంగా ఈ సంవత్సరం మొత్తంలో పెట్రోల్‌పై రూ.2.20 -2.34, డిజీల్‌పై రూ. 3.16-3.61 పెరిగాయి.  మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధర సోమవారం స్వల్పంగా క్షీణించింది.  ఫ్యూచర్స్‌లో క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 24 సెంట్లు నష్టపోయి  65.97 డాలర్లుగా నమోదైంది.

మరిన్ని వార్తలు