ఎయిరిండియా కొత్త సీఎండీ ప్రదీప్‌ సింగ్‌

29 Nov, 2017 01:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’ కొత్త సీఎండీగా ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా నియమితులయ్యారు. ఈయన 1985 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుత ఎయిరిండియా సీఎండీ రాజీవ్‌ బన్సాల్‌ నుంచి ప్రదీప్‌ సింగ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియా వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో ఖరోలా నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఈయన 2015 ఫిబ్రవరి నుంచి బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే కర్ణాటక అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, కర్నాటక ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.   

మరిన్ని వార్తలు