జోరుమీదున్న సేవా రంగం 

4 Aug, 2018 00:18 IST|Sakshi

జూలైలో 54.2 శాతంగా నమోదు 

అక్టోబర్‌ 2016 తర్వాత గరిష్టస్థాయి

న్యూఢిల్లీ: దేశీ సేవల రంగ కార్యకలాపాలు జోరుమీదున్నాయి. వరుసగా 2వ నెలలోనూ వృద్ధి చెంది అక్టోబర్‌ 2016 తరువాత అత్యంత గరిష్టస్థాయిని నమోదుచేశాయి. జూన్‌లో 52.6 శాతంగా ఉన్న నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ జూలైలో 54.2 శాతానికి ఎగసింది. డిమాండ్‌ ఊపందుకోవడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో ఈ రంగం జోరు కొనసాగుతోందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

గతేడాది జూన్‌ నుంచి బలమైన వృద్ధిరేటును కొనసాగిస్తూ సేవా రంగం ఆశాజనకంగా ఉందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఆర్థిక వేత్త ఆశ్నా దోధియా వ్యాఖ్యానించారు. ఇక సేవారంగం, తయారీ రంగానికి సంయుక్త సూచీగా ఉన్న నికాయ్‌ ఇండియా కాంపోజిట్‌ పీఎమ్‌ఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ జూలైలో 54.1 శాతానికి చేరింది. ఈ సూచీ అంతక్రితం నెలలో 53.3 శాతంగా ఉంది.

 

మరిన్ని వార్తలు