బీఎస్‌-6 యమహా కొత్త బైక్‌ లాంచ్‌.. 

9 Dec, 2019 13:36 IST|Sakshi

బీఎస్‌ -6 నిబంధనలకనుగుణంగా యమహా కొత్త బైక్‌

 వైజెడ్ఎఫ్-ఆర్15  లాంచ్‌, ధర రూ .1.45 లక్షల నుంచి ప్రారంభం​

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో త్వరలోనే కొత్త ఉద్గార నిబంధనలు అమలు కానున్న నేపథ్యంలో యమహా కూడా బీఎస్‌-6 ద్విచక్ర వాహనాన్ని లాంచ్‌ చేసింది.  వైజెడ్ఎఫ్-ఆర్15 (వెర్షన్ 3.0) మోటారు సైకిల్ మోడల్‌ను ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) సోమవారం లాంచ్‌ చేసింది. దీని ధర  రూ .1.45 లక్షలతో ప్రారంభమవుతుంది. 155 సీసీ ఇంజన్‌తో ఈ కొత్త బైక్‌  డిసెంబర్ మూడవ వారం నుండి భారతదేశంలోని అన్ని కంపెనీ డీలర్‌షిప్‌లలో లభిస్తుందని ఐవైఎం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ కొత్త బైక్‌లో వెనుక చక్రంలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ స్విచ్, డ్యూయల్ హార్న్ ,  రేడియల్ ట్యూబ్‌లెలెస్ టైర్ వంటి లక్షణాలు ఉన్నాయి. మూడు కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ ధర రూ .1.45 లక్షల నుంచి రూ .1.47 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ఉండనుంది. "యమహా ఆర్ సిరీస్‌తో ట్రాక్ పెర్ఫార్మెన్స్‌ను కొనసాగించడంతపాటు, బీఎస్‌-6  ఆధారిత ఇంజిన్‌తో కొత్త వైజెడ్ఎఫ్-ఆర్ 15  కొత్త ఫీచర్లతో కస‍్టమర్లను ఆకట్టుకుటుందని  యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మోటోఫుమి షితారా తెలిపారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు