మావోయిస్టు కామేశ్వరి ఎన్‌కౌంటర్‌

9 May, 2019 13:47 IST|Sakshi
కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్య కేసులో నిందితురాలు కామేశ్వరి అలియాస్‌ స్వరూప అలియాస్‌ రింకీ ఎదురుకాల్పుల్లో మృతిచెందిన దృశ్యం

కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్య కేసులో నిందితురాలు

పశ్చిమగోదావరి  ,జంగారెడ్డిగూడెం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మావోయిస్టు, భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్‌ స్వరూప, అలియాస్‌ చంద్రి, అలియాస్‌ సింద్రి, అలియాస్‌ రింకీ పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందింది. బుధవారం ఒడిస్సాలోని కోరాపుట్‌ జిల్లా పడువా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు, పోలీసు బలగాలు, స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూపు(ఎస్‌ఓజీ) మధ్య పెద్దెత్తున ఎదురు కాల్పులు జరిగాయి. కోరాపుట్‌ జిల్లా ఎస్పీ కేవీ సింగ్‌ తెలిపిన వివరాలు ప్రకారం కోరాపుట్‌ జిల్లా నందాపూర్‌ బ్లాక్‌ పరిధిలో గల హతీబరి పంచాయతీ సమీపంలో కిటువాకమీ అడవుల్లో 15 మందికి పైగా మావోయిస్టులు సమావేశమైనట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు, ఎస్‌వోజీ బలగాలతో దాడులు నిర్వహించామన్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు, ఎస్‌వోజీ, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయని, ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఆయన ధృవీకరించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు. చనిపోయిన మహిళా మావోయిస్టుల్లో భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్‌ స్వరూప అలియాస్‌ రింకీ ఉన్నట్లు ఎస్పీ తెలియజేశారు.

కామేశ్వరిది శ్రీకాకుళం కాగా, ఈమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈమె తల్లితండ్రులు శ్రీకాకుళంలో ఉండగా కామేశ్వరిని భీమవరంలో ఒక వ్యక్తికి చ్చి వివాహం చేశారు. కొంతకాలం కామేశ్వరి భర్తతో కాపురం చేయగా, వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. తరువాత తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపోలో కామేశ్వరి కండక్టర్‌గా పనిచేసింది. ఈ సమయంలోనే మావోయిస్టులపై ఆకర్షితురాలై 2008–09లో కామేశ్వరి మావోయిస్టుల్లో చేరింది. అప్పటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ యాక్షన్‌ టీమ్‌ సభ్యురాలిగా మారింది. కిడారి, సోమ హత్యోదంతం అనంతరం వీటి వెనుక భీమవరానికి చెందిన కామేశ్వరి అనే మావోయిస్టు పాత్ర ఉందని పోలీసులు పేర్కొన్నప్పుడు జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్‌ జోన్‌గా ఉంటూ వస్తోంది. ఈ సమయంలో మావోయిస్టుల వైపు ఎక్కువగా గిరిజనులు ఆకర్షితులై చేరుతుంటారు. అయితే మైదాన ప్రాంతం నుంచి మావోయిస్టుల్లో చేరడం అరుదు. జిల్లా నుంచి భీమవరంలో కొంత కాలం నివాసం ఉన్న కామేశ్వరి మావోయిస్టుల్లో చేరడం, క్రియాశీలకంగా మారి మావోయిస్టుల్లో ప్రధాన వ్యక్తిగా రూపాంతరం చెందింది. ఈ నేపధ్యంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె హతమైంది. జిల్లా నుంచి ఇలా మావోయిస్టుల్లో చేరి ఎన్‌కౌంట్‌లో హతమైన ఘటనలు గతంలోనూ జరిగాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బెజవాడ.. గజ గజలాడ!

అసభ్యంగా దూషించిందని..

పెట్టుబడులే ముంచేశాయి!

ప్రేమికుడిపై యాసిడ్‌ దాడి

పారిశ్రామికవేత్త ఇంట్లో ఎన్‌ఆర్‌ఐ హల్‌చల్‌

శోభనాన్ని అడ్డుకున్నాడని కన్న తండ్రిని..

వృద్ధ దంపతుల దారుణ హత్య

‘షేర్‌’ ఖాన్‌లు జాగ్రత్త!

అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం

అమెరికాలో దారుణం

డబ్బుల కోసం డ్రైవర్‌ దారుణం

ఎలుకల మందు పరీక్షించబోయి..

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ విదేశీ యువతి

‘నన్ను కూడా చంపండి’

పోకిరీల వేధింపులు.. బాలిక ఆత్మహత్య 

నకిలీ పోలీసు అరెస్టు..!

ఫాదర్స్‌ డే రోజే వెలుగుచూసిన దారుణం

పార్టీ  పేరిట పిలిచి.. స్పానిష్‌ యువతిపై..

లిస్బన్‌ క్లబ్‌ ఘటన.. డీజీపీ ఆరా

తోటల్లో వ్యభిచారం.. అధికులు కాలేజీ స్టూడెంట్సే

గర్భిణి అని కూడా చూడకుండా..

నవదంపతుల ఆత్మహత్య

ఒక్క ఫోన్‌ కాల్‌ విలువ రూ.40,000!

పోలీసుల ముందే బీరు తాగుతూ హల్‌చల్‌..

గంజాయి చాక్లెట్‌ 

తెల్లారిన బతుకులు

బెంబేలెత్తిన బీహార్‌.. ఒక్కరోజులో 40 మంది మృతి

ప్రియుడి మోజులో పడి.. దారుణానికి  ఒడిగట్టి..

నకిలీ ఎస్సై హల్‌చల్‌

ఓ విదేశీ జంట.. కరెన్సీ కావాలంటూ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ హీరోను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి

విజయ్‌కి జోడీ?

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

యూపీ యాసలో...

తిరిగొస్తున్నా