పది లక్షలు ఇవ్వకపోతే..

5 Nov, 2018 20:03 IST|Sakshi

నోయిడా : ఆడవారి పట్ల జరిగే అన్యాయాలను నిర్మూలించడానికి ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నాయి. ఇవన్ని బాధితులకు ఎంత మేర ఉపయోగపడుతున్నాయో తెలీదు కానీ.. ఈ చట్టాలను అడ్డం పెట్టుకుని అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నవారు కూడా ఉన్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి నోయిడాలోని లఖ్నావాలీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఓ మహిళ, బాధితుడు ఇద్దరు స్నేహితులు. ఈ క్రమంలో సదరు మహిళ పలు సందర్భాల్లో వేర్వేరు కారణాలు చెప్తూ తన స్నేహితున్ని డబ్బు ఇవ్వాల్సిందిగా కోరింది.

తొలుత వీటిని నిజమని నమ్మిన యువకుడు, స్నేహితురాలిని ఆదుకోవడం కోసం తనకు తోచినంత ఇచ్చేవాడు. ఈ క్రమంలో సదరు మహిళ పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సిందిగా అడగడం ప్రారంభించింది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం సదరు యువకున్ని 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసింది. ఒకవేళ తాను అడిగినంత ఇవ్వకపోతే ‘నాపై అత్యాచారం చేశావని కేస్‌ పెడతానం’టూ యువకున్ని బెదిరించడం ప్రారంభించింది. దాంతో యువకుడు ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు సదరు యువతి మీద ఐపీసీ సెక్షన్‌ 388, 506 కింద కేస్‌ నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా