లంచం కేసులో సర్వేయర్‌ అరెస్ట్‌

10 Nov, 2017 04:44 IST|Sakshi

అన్నానగర్‌: శ్రీరంగంలో రైతు వద్ద రూ.50 వేలు లంచం తీసుకున్న సర్వేయర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బుధవారం శ్రీరంగంలో చోటుచేసుకుంది. తిరుచ్చి సోమరసమ్‌పేట పొన్‌ నగరానికి చెందిన అరుళానందరాజ్‌ (40) రైతు. ఇతనికి సొంత స్థలం పుంగనూర్‌లో ఉంది. ఈ స్థలాన్ని సర్వే చేయడానికి ఆన్‌లైన్‌లో శ్రీరంగం తాలూకా కార్యాలయంలో ఉన్న సర్వేయర్‌ విభాగ కార్యాలయంలో నమోదు చేశాడు. నమోదు చేసి 9 నెలలు అయినా స్థలాన్ని సర్వే చేయలేదు. ఈ క్రమంలో తన స్థలాన్ని సర్వే చేసి ఇవ్వాలని శ్రీరంగం తాలుకా కార్యాలయంలో ఉన్న సర్వేయర్‌ గణేషన్‌ని అరుళానందరాజ్‌ అడిగాడు.

ఇందుకు, అతను రూ. 80 వేలు లంచం అడిగాడు. కానీ లంచం ఇవ్వడానికి ఇష్టపడని అతను తిరుచ్చి ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు రసాయనం పూసిన రూ.50 వేల నగదుని అరుళానందరాజ వచ్చి ఇచ్చి పంపారు. బుధవారం సాయంత్రం రూ. 50 వేల నగదు కార్యాలయంలో ఉన్న సర్వేయర్‌ గణేషన్‌ వద్ద అరుళానందరాజ ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జాయింట్‌ సూపరింటెండెంట్‌ రామచంద్రన్, సీఐలు శక్తివేల్, నవనీతకృష్ణన్, దేవిరాణి వెంటనే వచ్చి గణేషన్‌ని ఆధారాలతో పట్టుకొని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు చేసి సెంట్రల్‌ జైల్లో ఉంచారు. 

మరిన్ని వార్తలు