డీసీ దృష్టికి వ్యాపారుల సమస్యలు

27 Jul, 2016 01:09 IST|Sakshi
డీసీని సత్కరిస్తున్న చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వ్యాపారాలు సన్నగిల్లాయని, దీంతో వ్యాపారులు చాలా ఇబ్బందులతో వ్యాపారాలు కొనసాగిస్తున్నారని శ్రీకాకుళం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు విజయనగరం వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎల్‌.శ్రీనివాస్‌ దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం ఆయన ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపార సంఘాల తరఫున డీసీని సత్కరించారు. అనంతరం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు వాణిజ్యపన్నుల విభాగం వారి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, తమకు సహకరించాలని డీసీకి విన్నవించారు. దీనికి సానుకూలంగా స్పందించిన శ్రీనివాస్‌ అధికారులతో మాట్లాడి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు తెలిపారు. డీసీని కలిసిన వారిలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు అందవరపు వరహానరసింహం (వరం), ప్రధాన కార్యదర్శి పీవీ రమణ, ఉపాధ్యక్షులు కె.వాసు, పేర్ల సాంబమూర్తి, గుమ్మా నాగరాజు, కోశాధికారి గుమ్మా నగేష్, ఇతర ప్రతినిధులు ఏఎన్‌ఆర్‌ రాజు, కోణార్క్‌ శ్రీను, తంగుడు బాబు, ఎస్‌వీడీ మురళి, అమరావతి శ్రీను, కి ల్లంశెట్టి నరసింహమూర్తి, నవతా బాబ్జి, కోరాడ రమేష్, గుడ్ల చక్రధరరాజు, పేర్ల మహేష్, సుప్రీమ్‌ దివాకర్, దీర్ఘాశి సూర్యనారాయణ, గెంబలి శ్రీను, వీఎం రావు తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు