పత్తి చేల్లో దొంగలు పడ్డారు

21 Nov, 2016 00:30 IST|Sakshi
కర్నూలు(అగ్రికల్చర్‌):   పత్తి చేల్లో దొంగలు పడుతున్నారు. కరువు, పెద్ద నోట్ల మార్పిడితో ప్రజలు ఇళ్లల్లో డబ్బులు పెట్టడం లేదని తెలుసుకున్నారే ఏమో కానీ కొద్ది రోజులుగా దొంగలు పంట ఉత్పత్తులను అపహరిస్తున్నారు. గతంలో కల్లాల్లో పంట నూర్పిడి సమయంలో దొంగలు పడేవారు. ప్రస్తుతం ఏకంగా పొలాలకు వెళ్లి దిగుబడులను దోచుకెళ్తున్నారు. ఇటీవల కోడుమూరు మండలంలోని పులకుర్తి, కల్లపరి గ్రామాల్లో పత్తి దొంగతనాలు జరిగాయి. తాజాగా కర్నూలు మండలం జి.సింగవరం గ్రామాల్లో ఒకే రోజు పలువురి రైతుల పొలాల్లోని పత్తిని అపహరించారు. దాదాపు 20 క్వింటాళ్ల పత్తి చోరికి గురైనట్లు రైతులు చెబుతున్నారు. జి.సింగవరం గ్రామానికి చెందిన రైతులు మురళీమోహన్, రామకృష్ణ, మహేష్, బేరి మధు, వెంకటేశ్వర్లు, బేరి మద్దిలేటి చేలల్లో దాదాపు రూ.లక్ష విలువ చేసే పత్తిని ఎత్తుకెళ్లారు. కరువు కాలంలో చేతికొచ్చే అరకొర పంటను దొంగలను అపహరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  
మరిన్ని వార్తలు