హాకీపై స్పెయిన్‌ దేశస్తుల శిక్షణ

9 Aug, 2016 23:37 IST|Sakshi
హాకీపై స్పెయిన్‌ దేశస్తుల శిక్షణ
బుక్కపట్నం/పుట్టపర్తి అర్బన్‌: గ్రామీణ విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆర్డీటీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా మంగళవారం బుక్కపట్నంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్పెయిన్‌ దేశానికి చెందిన క్రీడాకారుల బృందంతో హాకీ ఆటపై శిక్షణ ఇచ్చింది.  కార్యక్రమంలో  పీడీ రఘు, ఆర్డీటీ మండల కో–ఆర్డినేటర్‌ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. అలాగే పుట్టపర్తి మండలం పెడపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్పెయిన్‌కు చెందిన ఆండ్రూ మిత్ర బృందం జిల్లా హాకీ అసోషియేషన్‌ సెక్రెటరీ విజయ్‌బాబు, జాయింట్‌  సెక్రెటరీ బాబయ్య సమక్షంలో విద్యార్థులతో గంట పాటు హాకీ ఆడి పలు మెలకువలు నేర్పారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రామచంద్రారెడ్డి, పీడీ నాగరాజు, ఉపాధ్యాయులు లక్ష్మీపతి, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.  
>
మరిన్ని వార్తలు