ఆమ్ల – ఆరోగ్యం

4 Nov, 2017 23:56 IST|Sakshi

గుడ్‌ ఫుడ్‌

ఉసిరి కాయలో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. కమలాపండులో లభించే సి విటమిన్‌ కంటే ఇరవై రెట్లు అధికంగా ఉసిరిలో ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా వాడితే  రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కేశాల నుండి కాలి గోళ్ల వరకు శరీరమంతటికీ ఉసిరి అవసరమే. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఖనిజలవణాలు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరొటిన్, గార్లిక్‌ యాసిడ్, బి కాంప్లెక్స్, సి విటమిన్‌లు ఉంటాయి.

∙చర్మవ్యాధులను దూరం చేస్తుంది. రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది ∙ అజీర్తి, కాన్‌స్టిపేషన్, గ్యాస్ట్రిక్‌ సమస్యలను తగ్గిస్తుంది ∙లివర్‌ పనితీరును మెరుగుపరుస్తుంది ∙ కొలెస్టరాల్‌ను కరిగిస్తుంది. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపు చేస్తుంది  నిస్సత్తువగా ఉన్న నరాలను శక్తిమంతం చేస్తుంది. పక్షవాతం వ్యాధిగ్రస్తులకు దీని అవసరం ఎక్కువ ∙ గాయాల నొప్పి, వాపును తగ్గిస్తుంది ∙ మెదడుకు టానిక్‌లా పనిచేసి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది ∙ కంటిచూపును మెరుగుపరుస్తుంది ∙ శరీరానికి శక్తినిస్తుంది, రోగనిరోధక శక్తి పెంచి అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

మరిన్ని వార్తలు