అసమాన అందం

3 Jan, 2020 03:50 IST|Sakshi

అసమానం అంటే సమానంగా లేకపోవడం. ఇది డిజైనర్‌ దుస్తులకు బాగా నప్పే విషయం. ధరించే డ్రెస్‌ డిజైన్‌ ఎంత హెచ్చు తగ్గులుగా ఉంటే ఆ స్టైల్‌ అంత ఆకర్షణీయంగా కనిపిస్తుందనేది నేటితరం ఆలోచన. ఆ ఆసక్తిని బట్టి పాశ్చాత్య ఫ్రాక్‌ డిజైన్స్‌ మాత్రమే కాదు మన దేశీయ సంప్రదాయ దుస్తుల్లోనూ ఈ స్టైల్‌ని చూపిస్తున్నారు డిజైనర్లు. ఈ అసమాన స్టైల్స్‌ క్యాజువల్‌ వేర్‌గానే కాదు సంగీత్, రిసెప్షన్‌ వంటి పార్టీలకూ కలర్‌ఫుల్‌గా అనిపిస్తున్నాయి.

సేమ్‌ కలర్‌ కట్‌

పువ్వుల బుటీస్‌ వచ్చేలా ఎంబ్రాయిడరీ చేసిన గులాబీ రంగు రాసిల్క్‌ టాప్‌కి, నెటెడ్‌ మెటీరియల్‌ని జత చేసి డిజైన్‌ చేసిన ఫ్రాక్‌ ఇది. స్కర్ట్‌ పార్ట్‌ని అసిమెట్రిక్‌స్టైల్‌లో డిజైన్‌ చేశారు.

లేయర్డ్‌ స్టైల్‌

మూడు సమాన లేయర్స్‌ తీసుకొని అసమానంగా డిజైన్‌ చేశారు శారీని. ఇది కుచ్చులతో డిజైన్‌ చేసినది కాదు. అసిమెట్రిక్‌ కట్‌తో శారీ డిజైన్‌లో తెచ్చిన స్టైల్‌. కుచ్చులున్న లాంగ్‌ స్లీవ్స్‌ బ్లౌజ్, నడుము దగ్గర బెల్ట్‌ను జత చేస్తే ఈ చీరకట్టు అసమానమైన అందంతో ఆకట్టుకుంటుంది.

ఇండోవెస్ట్రన్‌

రా సిల్క్‌ పెప్లమ్‌ బ్లౌజ్‌కి చెక్స్‌ వచ్చేలా స్వీక్వెన్స్, గోల్డ్‌ బీడ్స్, జర్దోసీ మిక్సింగ్‌తో వర్క్‌ చేశారు. దీనికి బాటమ్‌గా శాటిన్‌ పెన్సిల్‌ ప్యాంట్‌(ధోతీ ప్యాంట్‌) ధరించడంతో ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌ వచ్చింది. దీనికి జార్జెట్‌ అసిమెట్రిక్‌ స్టైల్‌లో దుపట్టా జత చేశారు.

శారీ కట్టు

పింక్‌ ఆరెంజ్‌ షేడ్‌ స్వీకెన్స్‌ శారీని బ్లాక్‌ బ్లౌజ్‌తో జత చేసి ఈ చీరకట్టులోనే అసిమెట్రిక్‌ స్టైల్‌ తీసుకువచ్చారు. బ్లౌజ్‌ని కాలర్‌ నెక్‌తో పాటు స్ప్రింగ్స్‌ ఇచ్చి కర్దానా స్టైల్‌లో డిజైన్‌ చేసి అంతా చమ్కీ వర్క్‌తో మెరిపించారు. ఎడమవైపు ఫుల్‌గా చీరతో కవర్‌ చేసి, కుడివైపు చేతికి కొంగును రోల్‌ చేశారు.

సింగిల్‌ స్లీవ్‌ బ్లౌజ్‌

చీరకట్టు సాధారణమే. ప్లెయిన్‌ శారీ ఏదైనా సింగల్‌ షోల్డర్‌ వెల్వెట్‌ బ్లౌజ్‌ ఎంపిక ఆకర్షణీయంగా ఉంటుంది. వెల్వెట్‌ క్లాత్‌కి ఎంబ్రాయిడరీ చేసి ఒక చేతికి మాత్రమే ఫుల్‌ స్లీవ్‌ ఇవ్వడం ఈ బ్లౌజ్‌ ప్రత్యేకత. అలా ఒక చేతికి ఫుల్‌ స్లీవ్, మరో చేతికి స్లీవ్‌లెస్‌తో అసిమెట్రిక్‌ స్టైల్‌ను ఇచ్చారు. స్లీవ్‌లెస్‌ అసౌకర్యంగా ఉందని భావించేవారికోసం  ప్లెయిన్‌ జార్జెట్‌ క్లాత్‌ని కుడివైపు నుంచి ఎడమవైపు బ్లౌజ్‌లోకి సెట్‌ చేశారు. దీంతో ఒక భిన్నమైన లుక్‌ వచ్చింది. చీరకట్టులో ఇదొక అసిమెట్రిక్‌ స్టైల్‌. అంచు చీరలను కూడా ఇలా డ్రేప్‌ బ్లౌజ్‌తో అందంగా కట్టుకోవచ్చు. సంగీత్, రెసిప్షన్, పుట్టిన రోజు వంటి వేడుకలకూ ఈ స్టైల్‌ బాగుంటుంది.

కాంట్రాస్ట్‌ షేడ్స్‌
కాలర్‌నెక్‌ ఉన్న ఎల్లో ఆర్గాంజా, లైట్‌ బ్లూ, హాఫ్‌వైట్‌ షేడ్స్‌ ప్యాటర్న్‌తో అసిమెట్రిక్‌ స్టైల్‌ ప్యాటర్న్‌ని డిజైన్‌ చేశారు. ఇది గెట్‌ టు గెదర్‌ పార్టీలకు నప్పే డ్రెస్‌.
– తులసి, డిజైనర్‌ లగ్జరీ కొచ్చర్, బంజారాహిల్స్, హైదరాబాద్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌: tulasidesignofficial

మరిన్ని వార్తలు