క్యాంపస్‌లో మాల్స్, బ్యూటీ సెలూన్లు!

20 Jul, 2015 03:17 IST|Sakshi
క్యాంపస్‌లో మాల్స్, బ్యూటీ సెలూన్లు!

విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రైవేటు వర్సిటీల వినూత్న పంథా
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలలో చేరేందుకు ఏటా వేలాది మంది విద్యార్థులు ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో విద్యారంగంలో పోటీని తట్టుకునేందుకు దేశంలోని ప్రైవేటు యూనివర్సిటీలు వినూత్న పంథాను అనుసరిస్తున్నాయి. అత్యుత్తమ బోధన, 100 శాతం ప్లేస్‌మెంట్ హామీలతో ప్రకటనలు గుప్పిస్తూనే మరోవైపు యువత అభిరుచులకు తగ్గట్లు క్యాంపస్‌లను తీర్చిదిద్దుతున్నాయి.

క్యాంపస్‌లలో షాపింగ్ మాల్స్, బ్యూటీ సెలూన్లు, స్విమ్మింగ్ పూల్స్, ఏటీఎంలు, ఫిట్‌నెస్ కేంద్రాలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. 600 ఎకరాల్లో ఏర్పాటైన జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సుమారు 30 వేల మంది విద్యార్థులకు నివాస ప్రాంతాలను నిర్మించింది. ఓపెన్ ఎయిర్ థియేటర్, సూపర్ మార్కెట్లు, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్, 40 ఏటీఎంలు, ఆరు బ్యాంకుల బ్రాంచీలను ఏర్పాటు చేసింది.

పుణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, నోయిడాలోని శారదావర్సిటీ,  నోయిడా, జైపూర్, లక్నోలలో భారీ క్యాంపస్‌లుగల అమిటీ యూనివర్సిటీలు కేఫటేరియాలు, బ్యూటీ సెలూన్లను ఏర్పాటు చేశాయి. మహారాష్ట్రలోని ప్రవర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, తమిళనాడులోని సత్యభామ వర్సిటీలలోనూ ఇవే తరహా సౌకర్యాలు ఉన్నాయి. నోయిడాలోని గల్‌గోటియా వర్సిటీలో డ్యాన్స్, మ్యూజిక్ స్టూడియో, బెంగళూరులోని జైన్ వర్సిటీలో కార్డియో ఫిట్‌నెస్ సెంటర్, స్టీమ్‌బాత్ సౌకర్యాలున్నాయి.

మరిన్ని వార్తలు