నోట్ల రద్దుపై రాద్ధాంతమెందుకు?

7 Dec, 2016 02:46 IST|Sakshi
నోట్ల రద్దుపై రాద్ధాంతమెందుకు?

అంబేడ్కర్ స్ఫూర్తితో మోదీ సాగుతున్నారు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధనలో భాగంగా ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటే విపక్షాలు రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. నల్లధనాన్ని వెలికితీ స్తున్న మోదీని ప్రతిపక్షాలు తప్పుబట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతి 20 ఏళ్లకోసారి కరెన్సీ నోట్లను రద్దు చేయడం ద్వారానే దేశంలో సమానత్వం వస్తుందని అంబేడ్కర్ సూచించారని, ఆయన ఆశ యాలు, ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని 2014 నుంచి మోదీ అనేక చర్యలను చేపట్టారన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం పార్టీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

నల్లధనం వెలికితీయడం ద్వారా వచ్చే మొత్తంలో 25 శాతం నిధులను గరీబ్ కల్యాణ్ యోజన పేరిట పేదలు, రైతులకు ఖర్చు చేస్తామని ప్రధాని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో నగదు రహిత సమాజం నిర్మాణానికి పాటుపడడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని లక్ష్మణ్ పేర్కొన్నారు. కేంద్రం ఇళ్లులేని నిరుపేదల కోసం రాష్ట్రానికి 90 వేల ఇళ్లు కేటారుుస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి మా త్రం పేదలపై మనసు రావడం లేదని విమర్శించారు. ఇళ్లు లేని పేదలను గుర్తించడం లేదని, రెండు పడక గదుల ఇళ్ల కోసం కేంద్రం పరిధిలోని హడ్కో ద్వారా రూ.3,300 కోట్ల రుణాన్ని ఇచ్చినా, ఆ ఇళ్లను నిర్మించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులు చెల్లించకుండా ఇబ్బందుల పాలు చేస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీజేపీ చేపట్టే ఉద్య మాల్లో పేదలు, మహిళలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బద్దం బాల్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, జి.మనోహర్‌రెడ్డి, శేరి నరసింగరావు, జాజుల గౌరి, బంగారు కృతి, నానావత్ భిక్కునాథ్‌నాయక్, గుంగగోని భరత్‌గౌడ్, వడ్డేటి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు