ఇసుక తుపాను, వర్షాలు: పెరుగుతున్న మృతులు

3 May, 2018 18:43 IST|Sakshi

న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలో బుధవారం అర్ధరాత్రి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇసుక తుపానుకు భారీ వర్షం కూడా తోడవడంతో వందలాది ఇళ్లు, చెట్లు కూలిపోగా, విద్యుత్‌ స్తంభాలు విరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హోం శాఖకు అం‍దిన నివేదిక ప్రకారం.. ఇసుక తుపాను, ఆ తర్వాత మెరుపులతో కూడిన వర్షం వల్ల 94 మంది మరణించినట్లు సమాచారం.ఇసుక తుపాను కారణంగా ఉత్తరప్రదేశ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో అధిక ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఆయా శాఖ అధికారులు నివేదికలో హోం శాఖకు వివరించారు.

హోం శాఖ వద్దనున్న సమాచారం ప్రకారం రాజస్తాన్లో 32 మంది.. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా  64 మంది మరణించగా, మరో 47 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, బిజ్‌నూర్‌, రాయ్‌ బరేలి, బరేలీ, సహరాన్‌పూర్‌, ఫిరోజాబాద్‌, చిత్రకూట్‌లలో ఎక్కువగా ప్రాణ నష్టం జరిగిందని రిలీఫ్‌ కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ఆగ్రా జిల్లాలో అత్యధిక ప్రాణనష్టం సంభవించిందని.. 43 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. 

>
మరిన్ని వార్తలు