కేంద్రం నిర్ణయంపై సుప్రీం కోర్టులో సవాల్‌

20 Jun, 2020 16:22 IST|Sakshi

న్యూఢిల్లీ: బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జార్ఖండ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. కోవిడ్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్రం నిర్ణయంతో జార్ఖండ్‌కు నష్టం వాటిల్లుతుందని శుక్రవారం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌లో పేర్కొంది. గిరిజన జనాభా, అడవులపై ప్రతికూల ప్రభావానికి సంబంధించి సరైన అంచనా వేయకుండానే గనుల వేలం నిర్ణయం తీసుకున్నారని జార్ఖండ్‌ అడ్వకేట్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ రిట్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.

అన్ని అంశాలకు సంబంధించి వివరణాత్మక అధ్యయనం అవసరమని అన్నారు. కాగా, బొగ్గు గనుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దేశంలోని 41 క్షేత్రాల ఆన్‌లైన్‌ వేలాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద బొగ్గు ఎగుమతిదారుగా నిలువాలని ఈ సందర్భంగా ప్రధాని ఆకాంక్షించారు. దిగుమతులు తగ్గించుకొని స్వయం సమృద్దిగా ఎదిగేందుకే ఈ నిర్ణయం తీసుక్నుట్టు ప్రధాని తెలిపారు. 
(చదవండి: ‘సెంట్రల్‌ విస్టా’పై మాదే తుది నిర్ణయం: సుప్రీం)

మరిన్ని వార్తలు