మాంద్‌సౌర్‌ కాల్పులపై కమిటీ నివేదిక

19 Jun, 2018 16:06 IST|Sakshi

భోపాల్‌: గత ఏడాది మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో పోలీసుల కాల్పుల కారణంగా ఆరుగురు రైతులు మరణించిన విషయం తెలిసిందే. కాల్పులపై నియమించిన కమిటీ మంగళవారం తుది నివేదికను విడుదల చేసింది. పంటకు మద్దతు ధర కల్పించాలని, పూర్తి రుణమాఫీ చేయాలని రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు ఆత్మరక్షణకై రైతులపై కాల్పులు జరిపారని విచారణ కమిషన్‌ చైర్మన్‌ ఏకే జైన్‌ తెలిపారు. 

కాల్పుల్లో మొదట ఐదుగురు చనిపోగా, తీవ్రంగా గాయపడిన వారిలో మరొకరు మరణించారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒక్క పోలీసు అధికారి మీద కూడా కేసు నమోదు కాకపోవడం గమనార్హం. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కాల్పులు జరిపారని, ఇలాంటివి జరగడం దురదృష్టకరమని రాష్ట్ర హోం మంత్రి భుపేందర్‌సింగ్‌ అన్నారు. రైతులపై కాల్పులు జరిపి ఏడాది గడిచిన సందర్భంగా మంద్‌సౌర్‌లో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఇటీవల కిసాన్‌ ఆందోళన్‌ ర్యాలీని నిర్వహించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు