దోపిడి దొంగలు... వయాగ్రా టాబ్లెట్లు

29 Nov, 2014 14:52 IST|Sakshi
దోపిడి దొంగలు... వయాగ్రా టాబ్లెట్లు

న్యూఢిల్లీ: దొడ్డి దారుల్లో సంపాదన కోసం ఆ ముగ్గురు దోపిడి దొంగలు ఓ ముఠాగా ఏర్పాడ్డారు. జాతీయ రహదారిపై ఉండే దాబాల వద్ద ఆగి ఉన్న వాహనాలనే లక్ష్యంగా చేసుకుని దోపిడిలు ప్రారంభించారు. ఆ క్రమంలో దాబా వద్ద సరుకుతో ఆగి ఉన్న లారీతో  ఉడాయించారు. న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని జరోదా పుస్తా రహదారిపై బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ సదరు వాహనాన్ని ఆపారు. లారీలో లోడ్ ఏమిటని ప్రశ్నించగా... గుటకలు మింగారు. పోలీసులకు సీన్ అర్థమైంది.

అంతే లారీలోని లోడ్ను తనిఖీ చేయగా... అగరబత్తులు, షాంపు ప్యాకెట్ల బాక్స్ల కింద వయాగ్రా టాబ్లెట్లు ఉన్న 20 అట్టపెట్టలను పోలీసులు కనుగొన్నారు. దీంతో పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకుని... లారీని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. పట్టుబడిన వయాగ్రా టాబ్లెట్ల విలువ దాదాపు 35 లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు. ముగ్గురు దొంగలు ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాకు చెందిన సలీం, ఖలీద్, షాజద్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. షాంపు, సబ్బుల విలువ రూ. 5  లక్షలు ఉంటుందని తెలిపారు.

>
మరిన్ని వార్తలు