కాలుష్య కారకులకు భారీ జరిమానా..!

20 Jul, 2016 17:22 IST|Sakshi
కాలుష్య కారకులకు భారీ జరిమానా..!

న్యూఢిల్లీః రాజధాని నగరంలో కాలుష్య నివారణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరో అడుగు ముందుకేసింది. కాలుష్యం కోరల్లో విలవిల్లాడుతున్ననగరంలో ఇకపై ధ్వని కాలుష్యాన్ని కూడా అరికట్టేందుకు చర్యలు తీసుకోనుంది. సైలెన్సర్ లేని వాహనాలు నడిపేవారిపై ఆంక్షలు విధించి, కాలుష్య కారకులకు 5000 రూపాయల జరిమానా విధించనుంది.

హస్తినలో వాయు కాలుష్యమే కాదు, ధ్వని కాలుష్యం కూడ ఎక్కువేనని గుర్తించిన ఎన్జీటీ.. కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్న వ్యక్తులపై కొరడా ఝుళిపించనుంది. సైలెన్సర్ లేని వాహనాలను నడుపుతూ, నగరంలో తీవ్ర శబ్దకాలుష్యాన్ని సృష్టిస్తున్న వారిపై 5000 వేల రూపాయలు జరిమానా వేయాలని ప్రకటించింది. ఎన్జీటీ ఛైర్ పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం.. భరించరాని, నిబంధనలకు విరుద్ధమైన ధ్వని కాలుష్యాన్ని సృష్టించేవారిపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మోటార్ వాహనాల చట్టం కింద చలాన్స్ మరియు పెనాల్టీలు విధించినట్లుగానే  పర్యావరణ కాలుష్యాన్ని సృష్టించే నేరస్థులు  'పొల్యూటర్ పేస్'  (కాలుష్య కారకులు) ఆధారంగా  5000 రూపాయలు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ ఎం ఎస్ నంబియార్ దర్శకత్వంతో కూడిన ధర్మాసనం తెలిపింది. అలాగే వాతావరణ పరిహారాన్ని ప్రత్యేక ఖాతాలో జమచేయాలని ట్రాఫిక్ పోలీసులకు గ్రీన్ ప్యానెల్ సూచించింది. నేరస్థులకు నోటీసులు జారీ చేయడంలో ఎన్జీటీని సంప్రదించేందుకు ట్రాఫిక్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.

భారీ శబ్దం వచ్చే హారన్స్ తీవ్ర శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తాయన్న ట్రిబ్యునల్..  వాటి వాడకంపై దేశరాజధానిలో నిషేధం విధించింది. వాహనాల్లో హారన్స్ నుంచి వచ్చే శబ్దం కాలుష్యానికి ప్రధాన సమస్య అని, ముఖ్యంగా ఢిల్లీలో  ట్రక్కు డ్రైవర్ల వంటివారు మితిమీరి హారన్ మోగించడంతో పాటు, డిటిసి బస్సులతో వచ్చే శబ్దం వల్ల కూడా నగరంలో కాలుష్యం తీవ్రమౌతోందని తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ అధికారులు ఈ కోణంలో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంచ్ పేర్కొంది. పర్యావరణ మంత్రిత్వశాఖ, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసి, నగరంలో శబ్దకాలుష్యాన్ని నివారించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా