చెన్నమనేని పౌరసత్వంపై తేల్చండి: సుప్రీం

11 Aug, 2016 20:06 IST|Sakshi

వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని మూడు నెలల్లోపు నిర్ధారిస్తూ హైకోర్టుకు తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం హైకోర్టు ఈ కేసును విచారణ చేపడుతుందని పేర్కొంది. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ప్రఫుల్లా సి.పంత్‌తో కూడిన ధర్మాసనం ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించింది.

చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ గతంలో ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈపిటిషన్‌ను విచారించిన హైకోర్టు రమేశ్ ఎన్నిక చెల్లదని, ఆయన భారత పౌరుడు కాదని 2013లో తీర్పు ప్రకటించింది. చెన్నమనేని రమేశ్ సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.

ఆయన తిరిగి 2014 ఎన్నికల్లో మళ్లీ వేములవాడ నుంచి గెలుపొందారు. అయితే హైకోర్టు ఇచ్చిన స్టే ను తొలగించాలని ఆది శ్రీనివాస్‌ను దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. గురువారం తుది విచారణ జరిపిన సుప్రీం కోర్టు కేంద్రం చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై మూడు నెలల్లో తేల్చాలని, ఆ నివేదికన హైకోర్టుకు సమర్పించాలని, హైకోర్టు విచారణ చేపడుతుందని ఆదేశాలు జారీచేసింది.

మరిన్ని వార్తలు