పావురం కోసం క్రేన్‌తో రంగంలోకి..

14 Jul, 2020 11:54 IST|Sakshi

పోలీసులపై నెటిజన్ల ప్రశంసలు

లక్నో: చైనా మాంజాతో పక్షుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ వీడియో చైనా మాంజ ఎంత ప్రమాదకారో తెలుపుతోంది. సరదాగా గాలిపటాలు ఎగరేయడానికి వాడే ఈ డ్రాగన్‌ దేశపు మాంజ పక్షులకు ఎన్ని ‘చిక్కులు’ తెచ్చిపెడతాయో చెప్పడానికి ఈ వీడియోనే సాక్ష్యం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చైనా మాంజలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఓ పావురాన్ని పోలీసులు రక్షించారు. 

మాంజలో చిక్కుకుని ప్రాణాపాయంలో పడిన పావురాన్ని గమనించిన స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు క్రేన్‌ను‌ రప్పించి పావురాన్ని మాంజ నుంచి విడిపించారు. దానికి స్వల్ప గాయాలు కాగా దగ్గరుండి చికిత్స చేయించి వదిలేశారు. దీంతో స్థానికులు పోలీసులకు అభినందనలు తెలిపారు. ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌ రమేశ్‌ పాండే మంగళవారం తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేయడంతో ‘శభాష్‌! పోలీస్’‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
(వైరల్‌: అచ్చంగా వాటిలాగానే కేకులు!)

మరిన్ని వార్తలు