దళిత దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం!

27 Jul, 2013 03:22 IST|Sakshi
దళిత దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం!
కత్తి పద్మారావు ఈ రోజు 60 ఏళ్ల మైలురాయి దాటుతున్నారు. చరిత్రలో కొన్ని మైలురాళ్లు ఉంటాయి. మైలురాళ్ల ద్వారా చరిత్రను సంక్షి ప్తీకరిస్తుంటారు. స్వాతంత్య్రానంతర ఉద్య మాల్లో, పరిణామాల్లో అంబేద్కర్ బౌద్ధ స్వీకా రం, రాంమనోహర్ లోహియా దేశీయ సామ్యవాదం, దళిత పాంథర్స్, నక్సల్‌బరి, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ‘సం పూర్ణక్రాంతి’, జగిత్యాల జైత్రయాత్ర, ఇంద్ర వెల్లి, కారంచేడు, చుండూరు మొదలైనవి చరిత్రలో కొన్ని మైలురాళ్లుగా నిలిచిపోయా యి. కత్తి పద్మారావు దళిత మహాసభకు, దళిత ఉద్యమ స్ఫూర్తికి పర్యాయపదంగా చరి త్రలో నిలిచిపోయారు. దళిత ఉద్యమంలో కత్తి పద్మారావు రాకముందు వేరు, వచ్చాక వేరు. కత్తి పద్మారావు గ్రూప్ ఫొటో నుంచి విస్తరించి మహాశక్తిగా ఎదిగారు. తద్వారా దళిత ఉద్యమాలకు మారుపేరుగా నిలిచారు.
 
 కత్తి పద్మారావు బాల్యం నుంచి స్వయం కృషితో ఎదిగారు. ఆలోచనలో, ఆచరణలో తనదైన క్రమంలో ముందుకుసాగారు. నాస్తి క, హేతువాద, చార్వాక భావజాల ఉద్యమా లలో క్రియాశీలంగా పాల్గొని ఎదిగారు.
 
 1985, జూలైలో కారంచేడు దుర్ఘటనకు వ్యతిరేకంగా దళిత ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికింది. పలు పార్టీలు, సామాజిక సంస్థ లు ఆ ఉద్యమంలో కలిసి నడిచాయి. విప్లవ ప్రజా సంఘాలు, వామపక్ష ప్రజా సంఘాలు దళిత ఉద్యమంలో తమదైన వర్గ దృక్పథంతో చురుకుగా ముందుకు సాగినప్పుడు కత్తి పద్మారావు అంబేద్కర్ చూపిన మార్గంలో దళిత దృక్పథంతో, కుల సమస్యని గుర్తించా లని వర్గ దృక్పథం చాలదని ప్రతిపాదించారు. అది రాష్ట్రంలో సామాజిక ఉద్యమాలలో నూత న సమీకరణలను వేగవంతం చేసింది. పద్మా రావు కుల సమస్యపై ముందుకుతెచ్చిన చర్చ, దళిత దృక్పథం నాలాంటి వాళ్లు వేలాదిగా వామపక్ష వర్గదృక్పథం నుంచి అంబేద్కర్ దృక్పథంలోకి రావడానికి ఉపకరించాయి.
 
 పద్మారావు తన భావజాలంతో విప్లవ సాహిత్యోద్యమాన్ని, విప్లవోద్యమాన్ని ఢీకొ న్నారు. 1985 నుంచి సాగిన ఈ భావజాల సంఘర్షణలో దళిత ఉద్యమాన్ని, దాని భావ జాలాన్ని వామపక్ష-విప్లవ-మార్క్సిస్టు-లెని నిస్ట్-మావోయిస్టు ఉద్యమాల భావజాలాల పదఘట్టనల నుంచి రక్షించి, ప్రత్యామ్నాయ రాజకీయ భావజాలంగా వృద్ధి చేసి, బలోపే తం చేశారు. సామాజిక న్యాయసాధనకు బుద్ధిస్టు-అంబేద్కరిస్టు మార్గమే సరైనదని ఆచరణాత్మకంగా చాటి చెప్పారు. 
 
 పద్మారావు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేసి న ప్రభావంతో నా లాగే ఎందరో విప్లవకా రులు, వామపక్ష వాదులు దళిత దృక్పథంతో, దళిత ఉద్యమాలతో ఏకీభవిస్తూ ముందుకు సాగారు. కారంచేడు, చుండూరు ఉద్యమా లకు నాయకత్వం వహిస్తూ దార్శనికుడిగా, సమాజానికి మార్గదర్శనం చేసిన పద్మారావు సాగించిన అస్తిత్వ పోరాటం అసాధారణై మెనది. పద్మారావు తన ఆచరణ ద్వారా, ఉద్యమాల ద్వారా ప్రజాస్వామిక సంస్కృతి నిర్మాణానికి దోహదం చేశారు. కుల నిర్మూల నలో కులాంతర వివాహాలు ప్రధాన పాత్ర వహిస్తాయనే విశ్వాసంతో వందలాది కులాం తర, మతాంతర వివాహాలు జరిపారు. సొంత కుటుంబంలో ఉమ్మడి కుటుంబాల సంబంధాలను నెలకొల్పారు. జీవన సహచరి స్వర్ణకుమారి సహకారం లేకండా ఈ మహో ద్యమం సాధ్యమయ్యేది కాదు. నిశ్శబ్ద విప్లవం లా స్వర్ణకుమారి, పద్మారావుకు కుడిభుజంగా నిలిచారు. చాలా మంది ఉద్యమకారులు, కవు లు, రచయితలు, కళాకారులు ఉద్యమంలోకి వ్యక్తులుగా వస్తారు. కుటుంబం కొంత సహక రించవచ్చు. కొందరికి అది కూడా ఉండదు. పద్మారావు నూతన సంస్కృతీ నిర్మాణానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నుంచి నాంది పలికారు.
 
 పద్మారావు చేసిన నిర్మాణంతో వేలాది మంది స్ఫూర్తి పొందారు. కొందరు విడిపో యి స్వతంత్రంగా ఎదిగారు. ఎవరు ఎక్కడ ఉన్నా, పద్మారావు ప్రభావాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక మహోపా ధ్యాయుడికి ఇంతకన్నా ఏం కావాలి? విప్లవో ద్యమంలో, వామపక్ష ఉద్యమాల్లో ఇలాంటి సంస్కృతి కనపడదు. భిన్నాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించే వారిని విమర్శించే, అవ మానించే సంస్కృతిని అలవరుచుకున్నారు. పద్మారావు ఇందుకు భిన్నంగా బుద్ధుడు చెప్పి న దృక్పథంతో కారుణ్య దృక్పథంతో, మాతృ స్వామిక వ్యవస్థలోని ప్రేమ దృక్పథంతో కార్యకర్తలను, సహచరులను, ఉద్యమకారు లను ప్రేమించారు. గౌరవించారు. భిన్నాభి ప్రాయాలు ఉన్నవారిని గౌరవిస్తూనే ఉదా త్తంగా అభిప్రాయబేధాలను చర్చించారు. ఈ ప్రజాస్వామిక సంస్కృతి ఎంతో సహనంతో అభివృద్ధిపరచారు.
 
 60 ఏళ్లు నిండుతున్న కత్తి పద్మారావు జీవితం సామాజిక న్యాయసాధనకు సాగే సుదీర్ఘ ప్రయాణంలో ఒక మైలురాయి. కత్తి పద్మారావు కవిగా, ఉద్యమకారుడిగా, నాయ కుడిగా, వక్తగా, దార్శనికుడిగా, బుద్ధిస్టు- అంబేద్కరిస్టుగా చేసిన కృషి చరిత్రలో నిలిచి పోతుంది. అది ఎవరు చెరిపివేయాలనుకున్నా చెరిపివేయలేని చరిత్ర. పద్మారావు మరెన్నో కర్తవ్యాలు నిర్వహించి రాజ్యాంగం అమలు లో, విస్తరణలో తన కృషిని కొనసాగించాలి.
 -బి.ఎస్.రాములు
 (కత్తి పద్మారావుకు నేటికి 60 వసంతాలు పరిపూర్తి)
మరిన్ని వార్తలు