ఐదేళ్ల తర్వాత వరల్డ్ గ్రూప్‌లో భారత్

10 Apr, 2016 01:00 IST|Sakshi

న్యూఢిల్లీ: జూనియర్ డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు రాణించారు. ఐదేళ్ల తర్వాత వరల్డ్ గ్రూప్‌నకు అర్హత సాధించారు. మూడో స్థానం కోసం శనివారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 2-0 తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. తొలిమ్యాచ్‌లో సిద్ధాంత్ 6-2, 6-4తో థామస్ జేమ్స్‌పై గెలుపొందగా, మరో మ్యాచ్‌లో ఆదిల్ 6-2, 6-4తో అలెగ్జాండర్‌పై నెగ్గాడు.

భారత్‌తో పాటు చైనా, జపాన్ కూడా వరల్డ్ గ్రూప్‌నకు అర్హత సాధించాయి. భారత ప్రదర్శనపట్ల అఖిల భారత టెన్నిస్ సంఘం(ఏఐటీఏ) అధ్యక్షుడు అనిల్ ఖన్నా హర్షం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు రూ. లక్ష చొప్పున నగదు పురస్కారాన్ని ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు