టెస్టు చరిత్రలో నాలుగో భారత బౌలర్‌గా..

15 Jun, 2018 16:53 IST|Sakshi
భారత బౌలర్‌ అశ్విన్‌

సాక్షి, బెంగళూరు: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ముందుగా బ్యాట్స్‌మెన్‌ చెలరేగగా, అనంతరం బౌలర్లు చకచకా వికెట్లు తీస్తు విజయాన్ని దగ్గర చేస్తున్నారు. భారత బౌలర్ల ధాటికి మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసేలా ఉంది. ఇక ఈ చారిత్రక టెస్ట్‌లో పలు రికార్డులు సృష్టిస్తున్న టీమిండియా ఆటగాళ్లు, తాజాగా భారత స్టార్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో మైలు రాయిని అందుకున్నాడు. అఫ్గాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో అస్గార్‌ స్టానిక్‌జాయ్‌ వికెట్‌ తీసి.. తద్వారా భారత్‌ తరపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేస్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌(92 టెస్టుల్లో 311 వికెట్లు) రికార్డును అధిగమించాడు. అశ్విన్‌ 58 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించటం విశేషం. 

100 వికెట్ల క్లబ్‌లో ఉమేశ్‌ యాదవ్‌
టీమిండియా పేస్‌ బౌలర్‌​ ఉమేశ్‌ యాదవ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్‌ షాను ఔట్‌ చేయడంతో టెస్ట్‌ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా ఈ ఘనత సాధించాడు. 37 టెస్టుల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. 
 

భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు:

  1. అనిల్ కుంబ్లే- 619 వికెట్లు (132 టెస్టుల్లో)
  2. కపిల్ దేవ్ - 434 వికెట్లు   (131 టెస్టుల్లో)
  3. హర్భజన్‌సింగ్- 417 వికెట్లు (103 టెస్టుల్లో)
  4. అశ్విన్-315 వికెట్లు (ప్రస్తుతానికి) (58 టెస్టుల్లో)
  5. జహీర్‌ఖాన్-311 వికెట్లు (92 టెస్టుల్లో)
మరిన్ని వార్తలు