'నన్ను కోచ్ దూషించాడు'

17 Aug, 2017 16:16 IST|Sakshi
'నన్ను కోచ్ దూషించాడు'

కరాచీ:తనను క్రికెట్ కోచ్ మైక్ ఆర్థర్ తీవ్రంగా దూషించాడంటూ పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఆరోపిస్తున్నాడు. లాహోర్ లో జాతీయ క్రికెట్ అకాడమీలో తమ మధ్య జరిగిన వాగ్వాదం సందర్భంగా తనపై ఆర్థర్ దూషణలకు పాల్పడ్డాడని అక్మల్ పేర్కొన్నాడు. ఇందుకు చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ తో పాటు ముస్తాక్ అహ్మద్ లే సాక్ష్యమన్నాడు.

 

'నాతో వాగ్వాదం సందర్భంగా ఆర్థర్ చాలా పేలవమైన భాష మాట్లాడాడు. అదే క్రమంలో దూషణలకు దిగాడు. మా క్రికెట్ పెద్దలు ఇంజమామ్, ముస్తాక్ లు సాక్షిగా నాపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఫిట్ నెస్ శిక్షణకు హాజరైన క్రమంలో క్లబ్ క్రికెట్ ఆడుకో అని ఆర్తర్ సహనాన్ని కోల్పోయాడు. అదే క్రమంలో తీవ్రస్థాయిలో దూషణలకు దిగాడు'అని ఉమర్ అక్మల్ తెలిపాడు. ఆ తరహా వ్యాఖ్యల్న ఒక కోచ్ నుంచి తాను ఊహించలేదన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు