ధోని తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లేవాడు..

30 Oct, 2016 12:52 IST|Sakshi
ధోని తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లేవాడు..

విశాఖ:న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక ఐదో వన్డేలో భారత్ పరాజయం చెంది ఉంటే అది భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీపై తీవ్ర ప్రభావం చూపేదని మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఐదో వన్డేలో గెలుపు అనేది అటు భారత్ క్రికెట్ జట్టుకే కాదు.. కెప్టెన్ ధోనికి కూడా చాలా ముఖ్యమైనదనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అయితే భారత జట్టు విజయం సాధించడంతో చాలా ప్రశ్నలను పక్కకు  నెట్టిందన్నాడు.

 

విశాఖలో జరిగిన చివరి వన్డేలో గెలుపుపై సంతోషం వ్యక్తం చేసిన గంగూలీ.. కీలమైన మ్యాచ్లో భారత్ తిరిగి పుంజుకోవడం నిజంగా ధోనికే అత్యంత  అవసరమన్నాడు. 'ఈ మ్యాచ్లో విజయం  ధోనికి అత్యంత ముఖ్యం. అతన్ని నిరూపించుకోవడానికి కివీస్తో వన్డే సిరీస్ సవాల్గా నిలిచింది. ఒకవేళ చివరి వన్డేలో ఓటమి చెందినట్లయితే, అది ధోని కెరీర్పై ప్రభావం చూపేది. ముఖ్యంగా అతను కెప్టెన్సీపై తీవ్ర ఒత్తిడి వచ్చేది. అటు బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ రాణించిన భారత్ విజయం సాధించడానికి అన్ని అర్హతలున్నాయి' అని గంగూలీ తెలిపాడు.

మరిన్ని వార్తలు