ఆసీస్ క్రికెటర్లు భారత్‌పై నోరు పారేసుకుంటే..!

25 Jan, 2017 17:42 IST|Sakshi
ఆసీస్ క్రికెటర్లు భారత్‌పై నోరు పారేసుకుంటే..!

న్యూఢిల్లీ: తాజాగా జరిగిన ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా కప్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు పుజారా. వచ్చే ఫిబ్రవరి నుంచి 13 టెస్టులకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ జరగనుంది. ఆసీస్ ఆటగాళ్లు తమపై నోరు పారేసుకుంటే (స్లెడ్జింగ్ చేసినా) ఏం చేయాలన్న ప్లాన్స్ టీమిండియాకు ఉన్నాయని పుజారా తెలిపాడు. గతంలో ఆసీస్ గడ్డపై వారు స్లెడ్జింగ్ చేశారని, ఇప్పుడు భారత్‌లో అలాంటి పరిస్థితులు తక్కువగా ఉంటాయన్నాడు. వాళ్లు స్లెడ్జింగ్ చేస్తే.. మేము కూడా మా శైలిలో అదే దూకుడు ప్రదర్శించి, ఆధిపత్యం చెలాయిస్తామని చెప్పాడు. భారత్ 120 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, ఆసీస్ 109 పాయింట్లతో టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉంది.

'కేవలం మూడో స్థానానికి తాను పరిమితం కాదని, డొమెస్టిక్ క్రికెట్లో ఈ స్థానంలో ఎన్నో విలువైన పరుగులు సాధించాను. కోచ్ అనిల్ కుంబ్లే కమిట్ మెంట్, క్రమశిక్షణతో టెస్టుల్లో అగ్రస్థానాన్ని సాధించాం. దాన్ని నిలుపుకోవడం చాలా కష్టమైన పని. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. పాజిటీవ్ ధృక్పథంతో ఉండి స్టైక్ రేట్‌ను పెంచుకోవడంపై దృష్టిపెడతాం. దీంతో ఆసీస్ బౌలర్లు కొత్తగా ఏదైనా ట్రై చేయడానికి చూస్తారు. మా పని సులువు అవుతుంది' అని పుజారా వివరించాడు. బౌలర్లు రాణించడంతో పాటు లోయర్ మిడిలార్డర్ గతంలో లాగానే మరిన్ని పరుగులు జతచేస్తే ఆసీస్ పై విజయం నల్లేరుపై నడకేనని పుజారా అభిప్రాయపడ్డాడు.

మరిన్ని వార్తలు