దానికోసం ఎక్కువగా జియోనే వాడుతున్నారు! | Sakshi
Sakshi News home page

దానికోసం ఎక్కువగా జియోనే వాడుతున్నారు!

Published Wed, Jan 25 2017 5:32 PM

దానికోసం ఎక్కువగా జియోనే వాడుతున్నారు!

ఉచిత వాయిస్ కాలింగ్, డేటా ఆఫర్లతో టెలికాం దిగ్గజాలన్నింటిన్నీ పక్కకు నెట్టేసి రిలయన్స్ జియో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. జియో స్పీడు స్లోగా ఉన్నట్టు అంతకముందు వార్తలు వచ్చినప్పటికీ, తర్వాత ఆ కంపెనీ డౌన్లోడ్ వేగాన్ని పెంచుకుంది. మరోవైపు ఉచిత సర్వీసులను పొడిగింది. దీంతో ప్రైమరీ డేటా కనెక్షన్గా యూజర్లు జియోవైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారట. ఇండియాలో ఎక్కువ మొబైల్ డివైజ్లలో ప్రైమరీ డేటా కనెక్షన్గా జియోనే వాడుతున్నారని రిపోర్టులు వెల్లడించాయి. 42 శాతం యూజర్లు తమ 4జీ స్లాట్లో జియోనే యాక్టివేట్ చేసుకున్నారని తెలిపింది.  జియో తర్వాత ఎయిర్టెల్ను వాడుతున్నారని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి.
 
కన్సూమర్ మొబైల్ అనాలిసిస్ యాప్ బుధవారం ఈ వివరాలను విడుదల చేసింది. 17.54 శాతం మంది ఎయిర్టెల్ను,12.26 శాతం మంది వొడాఫోన్ను,11.50శాతం మంది ఐడియాను  డేటా కనెక్షన్ కోసం వాడుతున్నారు.  డేటా వినియోగంలోనూ జియోనే ఆధిక్యంలో ఉంది. కంపెనీ ఇటీవలే వెల్కమ్ ఆఫర్ కింద అందించే ఉచిత సర్వీసులను 2017 మార్చి 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మొబైల్ డేటా వినియోగం మెట్రోల్లో 6జీబీ వరకు పెరుగుతుందని, నాన్-మెట్రోల్లో 5జీబీ వరకు పెరిగిందని రిపోర్టులు పేర్కొన్నాయి. ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, యూట్యూబ్ లాంటి వీడియో స్ట్రీమింగ్ యాప్స్ను ఎక్కువగా వాడుతున్నారు. 
 

Advertisement
Advertisement