పాక్ పై భారత్ విజయం

12 Dec, 2016 15:22 IST|Sakshi
పాక్ పై భారత్ విజయం

బ్యాంకాక్: మహిళల ఆసియా కప్ ట్వంటీ 20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు జైతయాత్ర కొనసాగుతోంది. మంగళవారం ఇక్కడ పాకిస్తాన్తో జరిగిన టీ 20 మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి హ్యాట్రిక్ కొట్టింది. పాక్ విసిరిన 98 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. భారత క్రీడాకారిణుల్లో ఓపెనర్లు మిథాలీ రాజ్(36), మందనా(14)లు చక్కటి ఆరంభాన్నిచ్చారు.అనంతరం భారత తడబడినా, మిగతా పనిని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(26 నాటౌట్) పూర్తి చేసి భారత్ కు విజయాన్ని అందించింది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అబిది(37 నాటౌట్) పాకిస్తాన్ జట్టులో టాప్ స్కోరర్.మరో క్రీడాకారిణి అయేషా జాఫర్(28) ఆకట్టుకుంది. భారత మహిళల్లో ఏక్తా బిస్త్ మూడు వికెట్లు సాధించగా, అనుజా పటేల్, హర్మన్ ప్రీత్లకు తలో రెండు వికెట్లు దక్కాయి.గత రెండు మ్యాచ్ల్లో థాయ్ లాండ్, బంగ్లాదేశ్లపై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు