స్వర్ణం నెగ్గిన సంబరాలలో...

17 Aug, 2016 18:57 IST|Sakshi
స్వర్ణం నెగ్గిన సంబరాలలో...

స్విమ్మింగ్ రారాజు, బంగారు చేపగా ప్రసిద్ధి గాంచిన అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్కు షాకిచ్చిన సింగపూర్ చిన్నోడు జోసెఫ్ స్కూలింగ్ స్వర్ణాన్ని నెగ్గిన సంబరాల్లో మునిగి తేలుతున్నాడు. రియోలో జరిగిన 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో జోసెఫ్ స్కూలింగ్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రియో ఒలింపిక్ పతకానికి గుర్తుగా ఓ టాటూ వేయించుకున్నాడు. తాను ఎంత సంతోషంగా ఉన్నాడో తెలిపేందుకు ఆ టాటూను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.

ఆ ఫొటోలో ఒలింపిక్స్ లోగోలే ఉండే ఐదు వలయాలు తన కుడిచేతిపై ఉన్న టాటూలో దర్శనమిస్తాయి. స్వర్ణం నెగ్గి సింగపూర్ చేరుకున్న ఈ చిన్నోడికి దేశం ఘన స్వాగతం పలికింది. జోసెఫ్ పోటీలో ఓడించింది అలాంటి ఇలాంటి స్విమ్మర్ను కాదు.. స్విమ్మింగ్ కే మారుపేరుగా నిలిచిన ఫెల్ప్స్ను రజతానికి పరిమితం చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకోవడం చాలా గొప్ప విజయం. 'టాటూ చాలా ఏళ్లుగా ఉండిపోతుందని తెలుసు, నాకు కావాల్సింది చివరికి దక్కింది' అని జోసెఫ్ స్కూలింగ్ తన ఫేస్ బుక్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఆ టాటూ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని వార్తలు