కోహ్లి ఇప్పటికే దిగ్గజం

4 Feb, 2015 01:11 IST|Sakshi

రిచర్డ్స్ ప్రశంస
 ముంబై: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఇప్పటికే వన్డే క్రికెట్ దిగ్గజంగా ఎదిగాడని వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అభిప్రాయపడ్డారు. ఆయన దృష్టిలో ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మెన్ జాబితాను వెల్లడించారు. ఇందులో సచిన్‌కు అగ్రస్థానం ఇచ్చారు.

ఆ తర్వాత లారా, గేల్, లాయిడ్, పాంటింగ్, హేడెన్, సెహ్వాగ్, మైక్ హస్సీ, డివిలియర్స్, కోహ్లిలను ఆ జాబితాలో ప్రస్తావించారు. ‘చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ పేర్లను ప్రస్తావించినప్పుడు అందులో చివరి పేరు కోహ్లి కావడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ తను ఇప్పటికే నా దృష్టిలో ఓ దిగ్గజం’ అని రిచర్డ్స్ చెప్పారు. భవిష్యత్‌లో టెస్టు క్రికెట్‌లోనూ విరాట్ కచ్చితంగా రాణిస్తాడని అభిప్రాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు