తొలి టెస్టుకు వర్షం అడ్డంకి

23 Sep, 2016 16:21 IST|Sakshi
తొలి టెస్టుకు వర్షం అడ్డంకి

కాన్పూర్:భారత-న్యూజిలాండ్ల మధ్య కాన్పూర్లో జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా టీ బ్రేక్ తరువాత భారీగా వర్షం పడటంతో మ్యాచ్ను నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 47.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది. లాథమ్(56 బ్యాటింగ్), విలియమ్సన్(65 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు గప్టిల్(21)ను తొలి వికెట్ గా న్యూజిలాండ్ కోల్పోయింది. ఈ వికెట్ ఉమేష్ యాదవ్ ఖాతాలో చేరింది.

 

వర్షం కారణంగా రెండో రోజు ఆట పూర్తిగా సాధ్యపడలేదు. ఈ రోజు ఆటలో కేవలం 54.0 ఓవర్లు మాత్రమే పడ్డాయి.  భారత్ తొలి ఇన్నింగ్స్లో 318 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు