దానివల్ల పాకిస్తాన్ క్రికెటర్లకు నష్టమే

18 May, 2016 16:30 IST|Sakshi
దానివల్ల పాకిస్తాన్ క్రికెటర్లకు నష్టమే

న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఆడకపోవడం వల్ల పాకిస్తాన్ క్రికెటర్ల ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపిందని ఆ జట్టు చీఫ్‌ కోచ్ మిక్కీ ఆర్థర్ అంటున్నాడు. టి-20 క్రికెట్లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఆశించినస్థాయిలో రాణించలేకపోవడానికి ఇదే కారణమని చెప్పాడు.

'ఐపీఎల్లో ఆడకపోవడం పాకిస్తాన్ క్రికెటర్లకు నష్టమే. ఇలాంటి టోర్నీల్లో ఆడటం వల్ల ఆటగాళ్లు ఎంతో నేర్చుకుంటారు. క్రికెటర్లు తమ ప్రతిభకు పదును పెట్టడానికి ఇలాంటి టోర్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఐపీఎల్లో ఆడకపోవడం వల్ల టి-20 ఫార్మాట్లో పాక్ క్రికెటర్లు సతమతమవుతున్నారు' అని ఆర్థర్ చెప్పాడు. 2008 ముంబై ఉగ్రవాది తర్వాత ఐపీఎల్లో పాల్గొనకుండా పాక్ క్రికెటర్లపై నిషేధం విధించారు. అంతేగాక ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఐసీసీ నిర్వహించే టోర్నీలలో ఆడటం మినహా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు రద్దయ్యాయి.

>
మరిన్ని వార్తలు