రోహిత్‌ 100.. శ్రేయస్‌ 50

13 Dec, 2017 14:05 IST|Sakshi

భారత్‌ స్కోర్‌ 237/1

మొహాలీ: భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేల్లో భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీతో లంకపై కసి తీర్చుకున్నాడు. తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమై కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్‌ అంతకంతకు లంక బౌలర్లపై బదులు తీర్చుకున్నాడు.

మరో వైపు యువ ఆటగాడు  శ్రేయస్‌ అయ్యర్‌ అర్ధ సెంచరీ సాధించాడు. తొలుత శ్రేయస్‌ అయ్యర్‌ 50 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్‌ తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం 115 బంతుల్లో రోహిత్‌ 9 ఫోర్లు ఒక సిక్సుతో కెరీర్‌లో 16వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్‌ 39.3 ఓవర్లకు వికెట్‌ నష్టపోయి 237 పరుగులు చేయగలిగింది. ఇక రెండో వికెట్‌కు ఈ ఇద్దరూ భాగస్వామ్యం 100 దాటింది. లంకతో తొలి మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అయ్యర్‌ ఆ మ్యాచ్‌లో విఫలమైన రెండో మ్యాచ్‌లో రాణించి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు.

మరిన్ని వార్తలు